హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్‌లో సంచలన మలుపు.. వారు మైనర్లు కాదు..మేజర్లే..!

Hyderabad: జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్‌లో సంచలన మలుపు.. వారు మైనర్లు కాదు..మేజర్లే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jubileehills minor gangrape case: ఈ కేసులో 5వ మైనర్‌గా ఉన్న ఎమ్మెల్యే కుమారుడు ఘటన జరిగిన రోజు తీవ్రమైన నేరానికి పాల్పడలేదని పోలీసులు నివేదికలో పేర్కొన్నందున, అతడిని తాము ప్రశ్నించలేదని తెలిపారు. అందువల్ల అతడిని మైనర్‌గానే పరిగణించాలని తెలిపారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు (Jubileehills Gangrape Case) సంచలన మలుపు తిరిగింది. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం జువైనల్‌గా పరిగణించాలని తెలిపింది. అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిలో ఒకరు ఘటన జరిగిన సమయానికే 18 ఏళ్లు నిండి ఉండటంతో అతనిపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మిగతా ఐదుగురు మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్‌ ఎస్‌హెచ్‌వో పిటిషన్ వేశారు. దానిపై విచారణ అనంతరం శుక్రవారం వెనైల్‌ జస్టిస్‌ బోర్డు ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఐదుగురు మైనర్లలో 1 నుంచి 4 వరకూ ఉన్న నలుగురినీ మేజర్లుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్నీ తెలిసే.. పూర్తి స్పృహలో ఉండే నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 5వ మైనర్‌గా ఉన్న ఎమ్మెల్యే కుమారుడు ఘటన జరిగిన రోజు తీవ్రమైన నేరానికి పాల్పడలేదని పోలీసులు నివేదికలో పేర్కొన్నందున, అతడిని తాము ప్రశ్నించలేదని తెలిపారు. అందువల్ల అతడిని మైనర్‌గానే పరిగణించాలని తెలిపారు. జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌, 2015లోని సెక్షన్‌ 18(3) ప్రకారం మిగతా నలుగురి కేసు రికార్డును నాంపల్లిలోని బాలల కోర్టుకు బదిలీ చేసినట్లు వెల్లడించారు.

  జువైనల్ బోర్డు సభ్యులతో పాటు మానిసిక నిపుణులు కూడా నిందితులను విచారించారు. సెప్టెంబరు 28న సెకియాట్రీ ప్రొఫెసర్, సెప్టెంబరు 29న బోర్డు సభ్యులు వారిని విచారించి.. వేర్వేరు నివేదికలను సిద్ధం చేశారు. ఆ రెండు నివేదికలు దాదాపు ఒకేలా ఉన్నాయని.. జేజే బోర్డు ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. ఈకేసులో మైనర్లుగా ఉన్న నలుగురు నిందితులు పరిపక్వతతోనే ఉన్నారని ప్రొఫెసర్‌‌తో పాటు బోర్డు మెంబర్ చెప్పారు. ఐతే నేరం తాలూకూ పర్యవసానాలపై వారికి ఉన్న అవగాహన విషయంలో మాత్రం రెండు నివేదికల్లో తేడా ఉంది. ఆ అవగాహన వారికి ఉందని సైకియాట్రీ ప్రొఫెసర్‌ పేర్కొనగా, లేదని బోర్డు మెంబర్‌ అభిప్రాయపడ్డారు. ఐతే నేరం చేసినప్పుడు నిందితులు మద్యం సేవించి లేరని, పూర్తి స్పృహలోనే ఉండి నేరం చేసినందున మేజర్‌లుగా పరిగణించినట్లు ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ తెలిపారు.

  కాగా, మే 28న జూబిహిల్స్‌లో ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్‌‌లోని అమ్నేషియా పబ్‌కు వచ్చిన రొమేనియా మైనర్‌ బాలికపై సాదుద్దీన్‌ అనే యువకుడితో పాటు ఐదుగురు మైనర్లు సామూహిక అత్యాచారం చేశారు. బాలికను జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్‌ రేప్‌ చేశారు. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ అదే పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ కూతురి మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మే 31న పోక్సో యాక్ట్‌ ప్రకారం జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులు బాలికతో కలిసి కారులో తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. నిందితుల్లో రాజకీయ, ఉన్నత కుటుంబాలకు చెందిన వారి కుమారులున్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులకు జువెనైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఐతే వారు తీవ్రమైన నేరానికి పాల్పడినందున మేజర్లుగా పరిగణించి.. కఠిన శిక్ష విధించాలని పోలీసులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మొత్తం ఐదుగురు మైనర్లలో కోర్టు నలుగురిని మేజర్లుగా గుర్తించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Hyderabad, Jubilee Hills Gang rape case, Telangana

  ఉత్తమ కథలు