హోమ్ /వార్తలు /తెలంగాణ /

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ‘కమిషన్’ విచారణ షురూ...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ‘కమిషన్’ విచారణ షురూ...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నియమితులైన జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నియమితులైన జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణను ప్రారంభించింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టులో కమిషన్‌కు ఓ కార్యాలయాన్ని కేటాయించింది. జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ ఈ రోజు కార్యాలయానికి వచ్చింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణను అధికారికంగా ప్రారంభించింది.

దిశా కేసులో ఎన్‌కౌంటర్ కాబడ్డ నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్‌పై సీబీఐ లేదా ఇతర ఏజెన్సీతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, నష్టపరిహారం కింద తమ కుటుంబాలకు రూ.50లక్షలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని అనుసరించి.. నిందితుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించినందుకు పరిహారం కోరుతున్నట్టు చెప్పారు. ఎన్‌కౌంటర్‌కి ముందు,ఆ తర్వాత.. కేసుకు సంబంధించిన మొత్తం ఫైళ్లను పరిశీలించాలని కోర్టును కోరారు. అంతేకాదు,ఎన్‌కౌంటర్‌లో సీపీ సజ్జనార్ పాత్రపై కూడా విచారణ జరిపించాలన్నారు. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ సెక్రటరీ,తెలంగాణ చీఫ్ సెక్రటరీ,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్,ఎస్ఐ శ్రీధర్ కుమార్‌లను బాధ్యులుగా చేర్చారు. మృతులపై నమోదైన కేసులను రద్దు చేయాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.

విచారణ కమిషన్ కోసం హైకోర్టులో కార్యాలయం ఏర్పాటు

మరోవైపు దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు.

దిశ నిందతుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం... హైకోర్టు కీలక ఆదేశాలు, High Court Order to Re-Postmortem For Disha Case Accused sb
దిశ నిందితులు

నవంబర్ 27న రాత్రి దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి హత్య చేశారు. షాద్ నగర్ మండలం చటాన్‌పల్లి సమీపంలో ఆమె మృతదేహాన్ని కాల్చారు. అయితే, దిశను తగులబెట్టిన చోటే డిసెంబరు 6న నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్‌ మండలం చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై దాడిచేసి పారిపోయేందుకు నలుగురు నిందితులు ప్రయత్నించారని పోలీసులు అదే రోజు వెల్లడించారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారని.. పోలీసుల జరిగిన ఎదురుకాల్పులో వారు చనిపోయారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ (RGV Disha Movie)
చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ (RGV Disha Movie)

తాజాగా దిశ ఘటన ఆధారంగా సినిమా తీస్తున్నట్టు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్యను కూడా కలిశారు. కొన్ని వివరాలు తెలుసుకున్నాడు. చెన్నకేశవులు భార్య రేణుక 16ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓబిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్‌ చేశారు. అతడు దిశతో పాటు... రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వాడు చేసిన వెదవ పనికి.. ఇప్పుడు భార్యతో పాటు... పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు.

First published:

Tags: Disha accused Encounter, Disha murder case, Supreme Court, Telangana

ఉత్తమ కథలు