హోమ్ /వార్తలు /తెలంగాణ /

జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

జస్టిస్ సుభాషణ్ రెడ్డి (ఫైల్ ఫోటో)

జస్టిస్ సుభాషణ్ రెడ్డి (ఫైల్ ఫోటో)

నెలరోజులుగా అస్వస్థతతో ఉన్న సుభాషణ్‌ రెడ్డి.. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

    హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కన్నుమూశారు. నెలరోజులుగా అస్వస్థతతో ఉన్న సుభాషణ్‌ రెడ్డి.. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి మృతికి పలువురుప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌కు ఆదేశాలు చేశారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సుభాషన్ రెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. నెలరోజులుగా జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. లోకాయుక్త చైర్మన్‌గా పనిచేసిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. మరోవైపు జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డికి ముగ్గురు కుమారులు. ఇద్దరు న్యాయవాద వృత్తిలో ఉండగా, మరొకరు ఇంజనీరుగా పనిచేస్తున్నారు.


    First published:

    Tags: High Court, Telangana, Telangana News, Telangana updates

    ఉత్తమ కథలు