Jurala Project: జూరాలకు సందర్శకుల‌ తాకిడి

Jurala Project Route map | జూరాల డ్యాం 29 గేట్ల నుంచి నీటిని విడుదల‌ చేయడంతో నీటిని చూసేందుకు జనాలు తరలివచ్చారు.

news18-telugu
Updated: August 23, 2020, 8:39 PM IST
Jurala Project: జూరాలకు సందర్శకుల‌ తాకిడి
జూరాల ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి
  • Share this:
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు జూరాలకు భారీగా పోటెత్తారు. ప్రాజెక్టు ప్రధాన వంతెనపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జూరాల డ్యాం 29 గేట్ల నుంచి నీటిని విడుదల‌ చేయడంతో నీటిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యాటక ప్రేమికులు జూరాలవైపు పరుగులు తీశారు. జూరాలకు వివిధ ప్రాంతాల‌ నుంచి కార్లలో అత్యధికంగా రావడం కనిపించింది. మొన్నటి వరకు శ్రావణమాసం. ఆ తర్వాత. శుక్రవారంతో ముగియడంతో... జూరాలకు వచ్చిన ప్రతి సందర్శకుడు జూరాల ఎడమ కాలువ వైపు బారులు తీరారు. చేప రుచి‌ చూడనిది ఎవరూ అక్కడ నుంచి పక్కకు జారుకోలేదు.


జూరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి- సామాజిక వేత్త సుదర్శన్
సరిగ్గా సంవత్సరం క్రితం‌ జూరాల 62 గేట్లు తెరిచినప్పుడు‌ జూరాలను చూడటానికి భారీగా జనసందోహం వచ్చిందని ప్రముఖ‌ సామాజిక కార్యకర్త సుదర్శన్ తెలిపారు.‌ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడా పర్యాటక కేంద్రాలు లేవని... జూరాలను, బీచుపల్లి వద్ద ఉన్న నిజాంకోటను పర్యాటక కేంద్రంగా తీర్చదిద్దాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా కుటుంబ సమేతంగా జూరాలను చూడటానికి‌ ఎటువంటి‌‌
రవాణా అవకాశం లేకపోవడం దురదృష్టకరమన్నారు. కుటుంబంతో అహ్లాదాన్ని వీక్షించడానికి... సేద తీర్చడానికి కాని, ఎక్కడా షెల్టర్లు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని సుదర్శన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా‌ ప్రభుత్వం జూరాల వద్ద పర్యాటక కేంద్రానిన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 23, 2020, 7:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading