JUNIOR ARTIST FAMILY VERY POOR WHO DIED IN GACHIBOWLI ACCIDENT VRY
Mahabubnagar : అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని దయనీయ స్థితి... జూనియర్ ఆర్టీస్ట్.. మానస తండ్రి...
Mahabubnagar : అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని దయనీయ స్థితి...
Mahabubnagar : శనివారం అర్థరాత్రి కారు ప్రమాదంలో మృతి చెందిన జూనియర్ ఆర్టీస్టు ఎం మానస కుటుంబం అంత్యక్రియలకు కనీసం డబ్బులు లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉందంటూ ఆమె తండ్రి వాపోయాడు...మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలోని పాతబజార్‌కు చెందిన మానస గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగి కారు రెండు ముక్కలై ముగ్గురు జూనియర్ ఆర్టీస్టులు ( Gachibowli accident ) మృత్యువాత పడిన విషయం తెలిసిందే... మృతి చెందిన వారిలో ఎం. మానస అంత్యక్రియలు నేడు ఆమె స్వగ్రామంలో జరిగాయి. ఈ సంధర్బంగా మానస తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.. తన కూతురును బుల్లితెరపై చూద్దామనుకున్న తరుణంలో రోడ్డు ప్రమాదం మింగేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ( Gachibowli accident ) పదోతరగతి వరకు చదివిన మానస బుల్లితెరపై కనిపించాలన్న ఆశతో హైదాబాద్ మెట్లెక్కిందని ఈ సందర్భంగా తండ్రి వివరించాడు. షార్ట్ ఫిలింస్‌లో నటించేదని, షూటింగ్స్ లేనప్పడు ఇంటికి వచ్చేదన్నారు.
ఇటీవల ఇంటిలోని ఓ గదికి మరమ్మతు చేయించి రేకులకప్పుతో పాటు కలర్స్ వేయించిందన్నాడు. ఈనెల 16వ రాత్రి తన చేతికి గాయమైన సమయంలో కట్టుకట్టి ప్రాథమిక వైద్యం చేసిందని గుర్తు చేసుకున్నాడు.( Gachibowli accident )తన కూతురు వారం రోజుల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బస్సులో వెళ్లిందన్నాడు. ఈ సంధర్భంగా తన కూతురు అంత్యక్రియలకు డబ్బులు లేవని వాపోయాడు.
కాగా మానసది నిరుపేద కుటుంబం. ఆరేళ్ల క్రితం తల్లి బాలమణి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. తండ్రి రవీందర్ ఓ పెట్రోల్‌బంకులో పనిచేసేవాడు. అక్క వైష్ణవి కొరియర్ కార్యాలయంలో చిరుద్యోగిగా పనిచేస్తోంది. మానస మృతి తర్వాత మానస గ్రామంలో పాతబజార్ విషాదచాయలు అలుముకున్నాయి.
నలుగురు స్నేహితులు. వీకెండ్ సమయంలో ఓ స్నేహితుడి ఇంట్లో కలిశారు. బాగా మద్యం తాగారు. అర్ధరాత్రి దాటాక టీ తాగుదామని బయటకు వచ్చారు. కారు తీశారు. మద్యం మత్తులో అతివేగంగా నడిపారు. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఆ వేగానికి కారు రెండు ముక్కలైంది. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.