JUBILEE HILLS GANGRAPE CASE MINISTER KTR INTERESTING COMMENTS ON MINORS ROLE IN HYDERABAD GANG RAPE SK
KTR: జూబ్లిహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. మైనర్లకూ కఠిన శిక్ష తప్పదా?
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)
Jubileehills Gang rape case: జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగానే పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ (Jubileehills Gan grape case) కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా బీజేపీ నిప్పులు చెరుగుతోంది. నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో మైనర్‌పై సామూహిక అత్యాచార (Hyderabad Gang rape case) ఘటనపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం కేసులో మైనర్లను మేజర్లుగానే పరిగణించాలని ఆయన అన్నారు. రేప్‌లు చేస్తున్నారు.. ఇంకా మైనర్లేంటి? అని పేర్కొన్నారు. ఓ మైనర్.. మేజర్‌లా క్రూరమైన అత్యాచారానికి పాల్పడితే.. అతన్ని మేజర్‌గానే పరిగణించి కఠినంగా శిక్షించాలని.. జువైనల్‌గా చూడొద్దని కేటీఆర్ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును హైదరాబాద్ పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిగే సమయంలో ఐదుగురిని మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ (TS Ministr KTR) స్వాగతించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణించాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా, మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించాలన్న పోలీసుల విజ్ఞప్తిపై... జువైనల్ జస్టిస్ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటిని పరిగణలోకి తీసుకొని జువైనల్ జస్టిస్ బోర్డు తమ నిర్ణయం వెల్లడించనుంది. 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని జువైనల్ హోం నుంచి సాధారణ జైలుకు తరలించనున్నారు.
2017లో చాంద్రాయణ గుట్ట పరిధిలో 17 ఏళ్ల మైనర్.. 10 ఏళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడి.. హత్య చేశాడు. ఆ కేసులో మైనర్ నిందితుడిని జువైనల్ బోర్డు మేజర్‌గా భావించి.. జీవిత ఖైదు విధించింది. ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే నేరాన్ని మైనర్లు చేసినప్పుడు.. దానిని తీవ్రంగా పరిగణించి శిక్ష వేయవచ్చని పోలీసులు అంటున్నారు. జూబ్లిహిల్స్ కేసును కూడా అలాగే చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ జువైనల్ జస్టిస్ బోర్డు మైనర్లను మేజర్లుగా భావిస్తే మాత్రం.. అది మరో సంచలనంగా మారనుంది.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిని 4 రోజుల పాటు విచారించనున్నారు. ఈకేసులో ఇతడొక్కడే మేజర్. మిగిలిన ఐదు మంది మైనర్లే..! ప్రస్తుతం జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లను కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. కోర్టు అనుమతికోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.