హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gadwal : రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇంటర్‌ స్టూడెంట్ .. రాజేశ్వరే గద్వాల్ జిల్లా టాపర్

Gadwal : రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇంటర్‌ స్టూడెంట్ .. రాజేశ్వరే గద్వాల్ జిల్లా టాపర్

(విద్యాకుసుమం)

(విద్యాకుసుమం)

Gadwal: గద్వాల జిల్లాలో ఓ విద్యాకుసుమం రాలిపోయిన తర్వాత కూడా వికసించింది. గత నెలలో ఇంటర్ ఎగ్జామ్స్‌ రాసి ఇంటికి వెళ్తుండగా రోడ్డుప్రమాదం జరగడంతో రాజేశ్వరి చనిపోయింది. మరణానంతరం విడుదలైన ఫలితాల్లో ఆమె జిల్లా టాపర్‌ అని తెలిసిందు.

ఇంకా చదవండి ...

(Syed Rafi,News18,Mahabubnagar)

కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు బాధిత కుటుంబ సభ్యులు,బంధువులతో పాటు ప్రతి ఒక్కరిని బాధిస్తాయి. జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో గత నెల్లో జరిగిన ఓ దుర్ఘటన తాలుకు తీపి గుర్తుగా మిగిలిపోయే వార్త ఇప్పుడు అందర్ని కలచివేస్తోంది. ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన రాజేశ్వరి అనే ఇంటర్ విద్యార్ధి జిల్లా టాపర్‌గా నిలిచింది. గద్వాల(Gadwal)మండలం గోనుపాడు(Gonupadu)కస్తూర్బా గాంధీ(Kasturba Gandhi College)కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివిన రాజేశ్వరి (Rajeshwari)గత నెలలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఎంపీసీ(MPC) గ్రూప్‌లో 867 మార్కుల(Marks)తో జిల్లాలోనే అత్యధిక మార్కులు సంపాధించిన స్టూడెంట్‌గా నిలిచింది. ఈ శుభవార్త వినడానికి ఆమె ప్రస్తుతం బ్రతికిలేదు.

అప్పుడే చెప్పింది తానే టాపర్‌నని...

మే 19వ తేదిన ఇంటర్‌ సెకండ్ ఈయర్ లాస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రాజేశ్వరి తండ్రి నల్లన్న కుమార్తెను తీసుకొని గద్వాల నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో తండ్రి,కూతురు అక్కడిక్కడే మృతి చెందారు. బాగా చదువుతున్న అమ్మాయి పరీక్షలు రాసింది. మంచి మార్కులు వస్తాయని కుటుంబ సభ్యులతో పాటు కాలేజీలో లెక్చరర్లకు తెలిపింది. రాజేశ్వరి బాగా చదివి మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటుందనుకునే సమయంలో మృత్యువు రోడ్డు ప్రమాదంలో వెంటాడింది. రాజేశ్వరితో పాటు ఆమె తండ్రి ప్రాణాలను బలిగొనడం అందర్ని తీవ్రంగా బాధించింది.

ఫలితాలు వచ్చేలోపే చనిపోయింది..

గత నెలలో రోడ్డు ప్రమాదంలో ఆగిపోయిన విద్యార్దిని రాజేశ్వరి ఊపిరి మంగళవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల రూపంలో మళ్లీ మెరిసింది. ఆమె అందరికి చెప్పుకున్నట్లుగానే మంచి మార్కులు సాధించింది. జిల్లాలోని కేజీబీవీ కాలేజీలో టాపర్‌గా నిలిచింది. చనిపోయిన విద్యార్ధి ప్రతిభను గుర్తు చేసుకొని కుటుంబ సభ్యులతో పాటు తోటి విద్యార్ధులు , చదువు చెప్పిన అధ్యాపకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 19వ తేదిన ఎగ్జామ్స్‌ అయిపోగానే స్నేహితులు, అధ్యాపకులతో వీడ్కోలు పలికి తండ్రితో వెళ్తున్న సమయంలో పరీక్షలు బాగా రాశాను మేడమ్ కాలేజీ టాపర్‌గా వస్తానంటూ రాజేశ్వరి చెప్పిన మాటలను గుర్తుకు చేసుకున్నారు కాలేజీ ప్రత్యేక అధికారి శ్రీదేవి. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్ధిని ఇంటర్ ఫలితాల్లో కాలేజీ టాపర్‌గా నిలిచిన రాజేశ్వరి ఇప్పుడు అందరికి దూరం కావడం బాధాకరమైన విషయమని స్నేహితులు, కాలేజీ లెక్చరర్లు విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన రాజేశ్వరి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధించారు.

ఇది చదవండి: మీ మిత్రుడు లోన్​యాప్స్​ నుంచి రుణం తీసుకున్నాడా? అయితే మీకూ చిక్కులు ఎదురైనట్లే.. ఎందుకంటే..?


First published:

Tags: Jogulamba gadwal, TS Inter Results 2022

ఉత్తమ కథలు