(Syed Rafi, News18,Mahabubnagar)
తెలంగాణలో బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS)నేతలు ఒకరిపై మరొకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలు, అవినీతిమయంగా మారిందని బీజేపీ ఆరోపిస్తుంటే అంతకు మించి ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు.తాజాగా గద్వాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(Krishna Mohan Reddy) బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna)పై కీలక విమర్శలు చేశారు. డీకే అరుణ స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని ..ఓ టూరిస్టు నాయకురాలు అంటూ సంబోధించారు. డీకే అరుణ మంత్రిగా ఉన్న హయాంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసి 92శాతం వరకు పూర్తి చేసి కమిషన్లు ఇవ్వలేదని కుట్రతో క్రాంతి కంపిని వారిని భయబ్రాంతులకు గురి చేసిన ఆమె భర్త పై కేసు నమోదు కాగా యాంటీ సెప్టార్ బెయిల్ పై బయటికి వచ్చారని గుర్తు చేశారు.
టూరిస్ట్ నాయకురాలు..
అంతే కాదు మాజీ మంత్రి డీకే అరుణ ఓ టూరిస్టు నాయకురాలని కామెంట్ చేశారు. నెలలో రెండు, మూడు ప్రెస్ మీట్ పెట్టి జిల్లా ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమెను ఓ చెల్లని రూపాయిగా అభివర్ణించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్ ను నాణ్యత లేకుండా చెయ్యకపోవడంతో 4 టీఎంసీలు ఉన్న రిజర్వాయర్ రెండు టీఎంసీల నీటిని నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన రిజర్వాయర్లు లీకేజీ కారణంతో నీటి సామర్ధ్యాన్ని తక్కువగా నిలుపుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు వారు కమిషనర్ల కోసం కక్కూర్తి పడడంతో ఈరోజు ఈ పరిస్థితి నెలకొని ఉందని విమర్శించారు.
కమీషన్ల కోసమే కక్కూర్తి ...
ప్రజలను పట్టించుకోకుండా నెలకొకసారి చుట్టం చూపులాగా ప్రజలను కలుసుకుంటూ ప్రెస్ మీట్ లు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఓ టూరిస్ట్ లీడర్‌గా వ్యవహరిస్తోందని విమర్శించారు. చిన్నోనిపల్లి నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం అండగా ఉంటామని తెలిపారు.గద్వాల నియోజకవర్గ ప్రజలను తన గుండె పెట్టుకొని కాపాడుతాని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. చిన్నోనిపల్లి గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, DK Aruna, Telangana Politics