Home /News /telangana /

JAYANTI CELEBRATIONS AT THE HANUMAN TEMPLE IN KONDAGATTU JAGITYALA DISTRICT SNR KNR

Jagityala:హనుమాన్ మాల దీక్షాపరులతో కిక్కిరిసిన కొండగట్టు..అంజన్నకు ప్రత్యేక పూజలు

(అంజన్న జయంతి వేడుకలు)

(అంజన్న జయంతి వేడుకలు)

Jagityala:తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన హనుమాన్‌ క్షేత్రం కొండగట్టు అంజన్న దేవాలయం. హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతో పాటు దీక్షాపరులు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని పూజలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    తెలంగాణ(Telangana)లో అత్యంత ప్రసిద్ది గాంచిన ఆంజనేయస్వామి దేవస్థానం జగిత్యాల(Jagityala)జిల్లా కొండగట్టు(Kondagattu)లో ఉంది. ఇక్కడ ఏటా హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి వైశాఖ బహుళ శుద్ధ దశమి నాడు మంగళవారం పెద్ద హనుమాన్ జయంతి(Hanuman Jayanthi)ని నిర్వహించారు. కొండగట్టులో అంజనేయ స్వామికి చైత్రమాసంలో చిన్న జయంతి , వైశాఖమాసంలో పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. హనుమాన్‌ చిన్న జయంతికి భక్తులు మాలధారణ వేస్తారు. కొండగట్టులో పెద్ద జయంతికి మాత్రం పెద్ద ఎత్తున పూజలు , హోమాలు నిర్వహిస్తా రు.

    కొండగట్టుపై వేడుకలు..
    ఆలయ యాగశాలలో త్రికుండాత్మక త్రైయాహ్నిక యజ్ఞాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి నాడు ఆలయంలో స్వామి వారి మూల విరాట్టుకు , ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజాధికార్యక్రమాలు ఆచరింపచేసి యాగశాలలో త్రికుండాత్మక త్రైయాహ్నిక యజ్ఞాన్ని పూర్తి చేసిన అనం తరం స్వామి వారికి బారసాల నిర్వ హిస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందచేసి పూర్ణాహుతితో ఉత్సవాలను ముగిస్తారు. మూడ్రోజుల జయంతి ఉత్సవాల రోజుల్లో మొదటి రెండ్రోజులు మాలధారణ చేసిన దీక్షాపరుల సంఖ్య తక్కువగా ఉంటుంది. జయంతి రోజు మాత్రం పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

    పోటెత్తిన దీక్షాపరులు..
    రెండో రోజు అర్ధరాత్రి 12 తర్వా త దీక్షలను విరమించేందుకు దీక్షాపరులు ఒక్కసారిగా క్యూకడతారు. జయంతి రోజున మాల విరమణ చేయాలనే సెంటి మెంట్‌తో కొండగట్టుకు తరలివచ్చే దీక్షాపరులు గుట్ట కింద , గుట్టపైన ఆలయ పరిసరాలకు చేరుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆలయంలో అంజనేయ స్వామి మూల విరాట్టుకు ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. అటుపై యాగశాలలో అగ్నిప్రతిష్ట చేసి ఋత్వికుల ఆద్వ ర్యంలో త్రికుండాత్మక యజ్ఞాన్ని నిర్వ హించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు, దీక్షాపరుల కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

    ఏర్పాట్లపై ధర్మకర్తల అసంతృప్తి..
    హనుమాన్‌ పెద్ద జయంతికి ఆలయంలో చేసిన ఏర్పాట్లపై ఆలయ ధర్మకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . ప్రధాన ఆలయానికి , యాగశాలకు సరైన విధంగా లైటింగ్ ఏర్పాటు చేయకపోవడాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. సరైన విధంగా అలంకరణ చేయకపోవడం పట్ల ఆలయ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. అదేవిధంగా పారిశుద్య నిర్వాహణ సైతం సక్రమంగా లేదని.. ఎక్కడి చెత్త అక్కడే ఉంచుతున్నారని ధర్మకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Jagityala, Lord Hanuman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు