ఆఫీస్ మెట్లపై కూర్చొని.. వృద్ధురాలి పెన్షన్ కష్టం తీర్చిన కలెక్టర్

ఆయన కలెక్టర్ అని కూడా తెలియని మంగమ్మ.. సామాన్యునితో మాట్లాడినట్లే ''రెండేండ్ల సంది పింఛన్ వస్త లేదు బిడ్డా. కలెక్టర్ సారును కలుద్దామని వచ్చిన.'' అని చెప్పింది.

news18-telugu
Updated: February 26, 2020, 10:49 PM IST
ఆఫీస్ మెట్లపై కూర్చొని.. వృద్ధురాలి పెన్షన్ కష్టం తీర్చిన కలెక్టర్
మెట్లపై కూర్చున్న భూపాలపల్లి కలెక్టర్
  • Share this:
ప్రభుత్వ కార్యాలయాల్లో సేవల గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా పని జరగాలంటే నెరల తరబడి అధికారుల చుట్టూ తిరగాలి. కులం ధృవీకరణ పత్రం మొదలుకొని.. పెన్షన్, భూముల పట్టా వరకు ఏం కావాలన్నా.. ఆఫీసుల చుట్టూ పద్రక్షిణలు చేయాల్సిందే. అక్కడక్కడా సకాలంలోనే జరుగుతున్నా.. చాలా చోట్ల మాత్రం పరిస్థితి ఇలానే ఉంది.అధికారి కాదు కదా.. కనీసం అటెండర్ కూడా సామాన్యు ప్రజలను పట్టించుకోడు. కానీ ఈ కలెక్టర్ మాత్రం అతి సాధారణ వ్యక్తిలా మెట్లపై కూర్చున్నారు. పెన్షన్ కోసం వచ్చిన వృద్ధురాలితో కలెక్టరేట్ మెట్లపై కూర్చొని మాట్లాడారు. నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించి.. ఆమె కళ్లల్లో ఆనందాన్నిచూసి తానూ సంతోషపడ్డారు.

జయశంకర్ భూపాలపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు అజ్మీర మంగమ్మ (70) రెండేళ్లుగా పెన్షన్ కోసం ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరుగుతోంది. కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. ఆమెకు పెన్షన్ మంజూరు కాలేదు. ఐతే బుధవారం నగరంలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిలతో కలిసి కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తన కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో అజ్మీర మంగమ్మ ఆఫీసు మెట్లపై కూర్చొని ఉంది. వెంటనే ఆవిడ దగ్గరకు వెళ్లిన కలెక్టర్.. '' ఏమైంది పెద్దమ్మా.. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని ప్రశ్నించారు. ఆయన కలెక్టర్ అని కూడా తెలియని మంగమ్మ.. సామాన్యునితో మాట్లాడినట్లే ''రెండేండ్ల సంది పింఛన్ వస్త లేదు బిడ్డా. కలెక్టర్ సారును కలుద్దామని వచ్చిన.'' అని చెప్పింది.

తానే కలెక్టర్‌నని మహమ్మద్ అబ్దుల్ అజీం చెప్పడంతో..తన గోడును వెళ్లబోసుకుంది ఆ వృద్ధురాలు. రెండేళ్లుగా పించన్ రావడం లేదని, తినడానికి తిండి కూడా లేదని బాధపడింది. మంగమ్మ పరిస్థితిని చూసి చంలించిపోయిన కలెక్టర్.. ఆమె పక్కనే కూర్చొని, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్‌లో మాట్లాడారు. మంగమ్మకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా కలెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. మెట్లపై కలెక్టర్ కూర్చొని ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు గ్రేట్ సార్.. అంటూ అభినందిస్తున్నారు నెటిజన్లు. మీ లాంటి ఆఫీసర్లే ఈ సమాజానికి కావాలని కామెంట్లు పెడుతున్నారు.First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు