బంధుత్వం ఉన్నా తన ప్రేయసికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ప్రియుడికి ఆగ్రహం.. ఆమె తల్లిపై..

ప్రతీకాత్మక చిత్రం

చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉండటంతో తమ పెళ్లి జరుగుతుందనే ఆశపడ్డారు. అయితే ప్రేయసి తల్లి తన కుమార్తెకు వేరే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. దీంతో..

 • Share this:
  క్షణికావేశంలో యువత దారుణాలకు తెగిస్తోంది. ఈ మధ్యనే లవ్ ప్రపోజ్ చేస్తే ’కాస్త టైమ్ కావాలి‘ అన్న యువతిపై ఓ యువకుడు దాడి చేశాడు. రైల్వే స్టేషన్ లో ప్రేమిస్తున్నానంటూ చెప్పి, కాదన్నందుకు వేగంగా వస్తున్న రైలు కిందకు తోసేందుకు యత్నించాడో మరో యువకుడు. మరో చోట తనతో మాట్లాడటం మానేసిందని ఓ యువతి ఇంటికి వెళ్లి మరీ ఓ కుర్రాడు యాసిడ్ దాడి చేశాడు. తాజాగా ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిన ఓ యువకుడు అలాంటి దారుణానికే ఒడిగట్టాడు. అయితే ప్రేమించిన యువతిపై కాకుండా, ఆమె తల్లిని టార్గెట్ చేసుకున్నాడు. గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు. ఆమె చనిపోయిందని భావించి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తెలంగాణలోని జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని వనపర్తి గ్రామ శివారులో మర్రి తండా ఉంది. ఆ తండాకు చెందిన ధరావత్ భాస్కర్ డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే తండాకు చెందిన భూక్యా ఆగమ్మ రెండో కుమార్తెను ప్రేమిస్తున్నాడు. చాలా కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉండటంతో తమ పెళ్లి జరుగుతుందనే ఆశపడ్డారు. అయితే కారణాలేమిటో కానీ భూక్యా ఆగమ్మ తన కుమార్తెకు వేరే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. దీంతో ఆ కుటుంబంపై భాస్కర్ కక్ష పెంచుకున్నాడు. ఆగమ్మ వల్లే తనకు తన ప్రేయసి దక్కడం లేదనీ, వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కోపం పెంచుకున్నాడు.
  ప్రసవం తర్వాత ఒంటరిగా ఇంటికి.. పాప ఏదని భర్త నిలదీస్తే చనిపోయిందని చెప్పిన భార్య.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!

  మంగళవారం తండా సమీపంలో చెరువు దగ్గర ఆగమ్మ గొర్రెలను మేపుతోంది. అదే సరైన సమయం అనుకున్న భాస్కర్ గొడ్డలి తీసుకుని ఆమె వద్దకు వెళ్లాడు. దుర్భాషలాడుతూ ఆమెపై దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో మరణించిందని భావించాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. భాస్కర్ చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆగమ్మను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: 500 సార్లు వీర్యదానం చేసిన తండ్రి.. అమ్మాయిల జోలికి వెళ్లేందుకే భయపడిపోతున్న కొడుకు.. అసలు కథేంటంటే..
  Published by:Hasaan Kandula
  First published: