JANGAON TRS MLA MUTTHIREDDY YADHAGIRI REDDY CHALLENGE TO BJP LEADERS ABOUT TRS GOVERNMENT SCHEMES PRV
TRS MLA: బీజేపీ నేతలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్.. మా పథకాలు.. దేశంలో ఎక్కడైనా అమలవుతున్నాయో నిరూపిస్తే రాజీనామా చేస్తా..
ప్రతీకాత్మక చిత్రం
వరి ధాన్యం కొనుగోలు మొదలు ప్రతీ విషయంలోనూ కేంద్రం, రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. బండి సంజయ్ సైతం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆరోపణలు చేశారు. బీజేపీ ఆరోపణలపై తాజాగా జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు.
వరి ధాన్యం కొనుగోలు మొదలు ప్రతీ విషయంలోనూ కేంద్రం, రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ (CM KCR ) వైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy ) బండి సంజయ్‌లు (Bandi sanjay ) ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఇరు పార్టీల సవాళ్ల మీద సవాళ్లు విసురుకోవడంతో పాటు ఒకరినోకరు దూషించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సీఎం కేసీఆర్‌కు జైలే గతంటూ బీజేపీ నేతలు (BJP Leaders) అంటుంటే.. కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి.. మా దమ్మేంటో చూపిస్తామంటూ టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ సీఎం కేసీఆర్‌ను కలవడం.. ఆ తర్వాత బండి సంజయ్ కేసీఆర్, తేజస్వీలపై విమర్శలు గుప్పించడం జరిగాయి. ఇటీవల బండి సంజయ్ సైతం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆరోపణలు చేశారు. బీజేపీ ఆరోపణలపై తాజాగా జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Jangaon TRS MLA Muthireddy Yadagiri Reddy) స్పందించారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు (Welfare schemes) అమలవుతున్నాయని చెప్పారు.. ఇక్కడ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే మన దేశం అభివృద్ధిలో అమెరికాను దాటిపోతుందని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభిప్రాయపడ్డారు.. తెలంగాణ (Telangana)లో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారా..? అని బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.
ఈ పథకాలు (schemes) దేశంలో అమలవుతున్నట్లు నిరూపిస్తే ఆయనతో పాటు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు రాజీనామాలకు సిద్ధమని ముత్తిరెడ్డి సవాల్ చేశారు. నిరూపించకపోతే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లు రాజీనామా చేయాలని ముత్తిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇటీవలె మంత్రి ప్రశాంత్‌రెడ్డి సైతం బీజేపీపై ఫైర్ అయ్యారు. ‘‘దమ్ముంటే కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి.. మా దమ్మేంటో చూపిస్తామని వేముల సవాల్ విసిరారు. ‘మధ్యప్రదేశ్ నుంచి ఒక కుక్క వచ్చి కేసీఆర్ మీద మొరిగింది.. అస్సాం నుంచి వచ్చి ఇంకొకడు మొరుగుతున్నాడు.. బీజేపీ పాలిత రాష్టాల నుంచి కూలీలుగా తెలంగాణకు రావడం లేదా? తెలంగాణలో వ్యవసాయ భూములకు భారీగా ధరలుంటే.. ఆంధ్రాలో ధరలే లేవు. ఒకనాడు ఆంధ్రోళ్లు తెలంగాణ భూములు కొనేది. నేడు తెలంగాణ రైతులు ఆంధ్రాలో భూములు కొంటున్నారు.. తెలంగాణ వాళ్లు బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్నారా అనేది బీజేపీ నేతలు చెప్పాలి..’ అని అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఇటీవలె పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న మోదీ సర్కార్ దళారుల ఆదాయాన్ని మాత్రమే రెండింతలు పెంచిందని దుయ్యబట్టారు. దేశంలోని బీజేపీ పాలనలో కొత్త కొలువులు రాకపోగా...ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను తమ తాబేదార్లకు కట్టబెడుతూ దేశప్రజలను బీజేపీ ప్రభుత్వం పెను ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.