(P.Srinivas,New18,Karimnagar)
బిడ్డలకు ప్రాణం పోసి..అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులు ఎప్పుడూ బిడ్డల విషయంలో కఠినంగా వ్యవహరించరు. వాళ్లలో సహనం చచ్చిపోయే విధంగా బిడ్డలు ప్రవర్తిస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు. కాకపోతే రెండు వందల రూపాయల(Two Hundred Rupees ) విషయంలో తల్లిదండ్రులతో గొడవపడినందుకు కొడుకుకి మరణశిక్ష విధించారు పేరెంట్స్. ఈ షాకింగ్ న్యూస్ జగిత్యాల (Jagityal)జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకుతో తల కొరివి పెట్టించుకోవాల్సిన వాళ్లు..కన్నబిడ్డనే కొట్టి చంపారు. అసలు అంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ముందు ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు.
200రూపాయల కోసం..
చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు మారుతాడు అనుకున్నరు కన్న తల్లి తండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు తాగుడుకు బానిసై రోజు కుటుంబాన్ని వేధిస్తుండటంతో ఆ తల్లిదండ్రులు సహనం కోల్పోయారు. ఏ తల్లిదండ్రులు చేయని పనిని వారు చేశారు.కొడుకును కొట్టి చంపారు. ఈ ఘటన జగిత్యాల రాంనూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొదురుపాక భూమయ్య, రాజమ్మ దంపతులకు ఓ కుమర్తె, కుమారుడు ఉన్నారు. భూమయ్యకు సింగరేణి సంస్థలో ఉద్యోగం. ఉద్యోగరీత్యా అతడు కుటుంబంతో కలిసి గోదావరిఖనిలోనే నివాసం ఉండేవాడు. ఉద్యోగ విరమణ తర్వాత స్వగ్రామం రాంనూర్ వచ్చి స్థిరపడ్డాడు. గ్రామంలోనే ఉంటూ తనకున్న పొలాన్ని చూసుకునేవాడు.
బిడ్డను చంపిన పేరెంట్స్ ..
ఈ క్రమంలో ఆస్తి పంపకాల విషయంలో గత కొంత కాలంగా భూమయ్య దంపతులకు కుమారుడు మహేశ్ కు మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి తనపేరిట రాయాలని తల్లిదండ్రులను మహేశ్ నిత్యం వేధించేవాడు. చెడు వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులకు నరకం చూపించేవాడు. ఈ క్రమంలో ఈనెల 20న తనకు రూ. 200 కావాలని మహేశ్ తండ్రి భూమయ్యను అడిగాడు. తన వద్ద డబ్బు లేదని భూమయ్య కుమారుడితో చెప్పాడు. దీంతో తండ్రితో మహేశ్ మరోమారు గొడవపడ్డాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన తల్లిదండ్రులు.. కౌలుదారుడు శేఖర్‌తో కలిసి మహేశపై దాడి చేశారు. కర్రతో విచక్షణారహితంగా దాడి చేయటంతో కాళ్లు, చేతులు విరిగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మహేశ్ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagityal, Telangana crime news