తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్...కాంగ్రెస్‌కు పవన్ దగ్గరతున్నారా...?

తాజాగా కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్‌ను వెళ్లి స్వయంగా కలిశారు. దీంతో తెలంగాణలో కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చాయి. పవన్ కూడా జనసేన తరపున ప్రభుత్వంపై పోరాటానికి సై అన్నారు.

news18-telugu
Updated: September 9, 2019, 5:17 PM IST
తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్...కాంగ్రెస్‌కు పవన్ దగ్గరతున్నారా...?
కాంగ్రెస్ నేత విహెచ్, పవన్ కళ్యాణ్
  • Share this:
తెలంగాణలో జనసేన ఉనికి లేకపోయినప్పటికీ, ఇప్పుడిప్పుడే రాజకీయాలు ప్రారంభించింది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో సన్నిహిత సంబంధాలనే కలిగి ఉన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతో సైతం పవన్ పలు మార్లు భేటీ అవ్వడంతో పాటు ప్రభుత్వానికి మద్దతుగా ప్రకటనలు కూడా చేశారు. అంతే కాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జనసేన తెలంగాణలో పోటీకి దూరంగా నిలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ అది నామమాత్రం అనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటుకే పరిమితమై రాజకీయ ఉనికికే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో తెలంగాణలో అదృష్టం పరీక్షించుకునేందుకు పవన్ తపనపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే తాజాగా కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్‌ను వెళ్లి స్వయంగా కలిశారు. దీంతో తెలంగాణలో కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చాయి. పవన్ కూడా జనసేన తరపున ప్రభుత్వంపై పోరాటానికి సై అన్నారు.

ఇంత కాలం జనసేన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో సై అనే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌తో కలిసి నల్లమలలో యురేనియం తవ్వకాలపై గళం ఉమ్మడి పోరుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో పవన్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారనే వార్తలు రూఢీ అయ్యాయి.  అంతేకాదు ఇటీవల యూరియా కొరతకు సంబంధించిన విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం వైఖరిపై పవన్ విమర్శలు చేయడం గమనార్హం. అయితే జనసేన ఆవిర్భావం నుంచే కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాంగ్రెస్‌తో ఎంతవరకూ కలిసి పనిచేయగలరనే చర్చ ప్రారంభమైంది.
First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading