Home /News /telangana /

JANASENA FIRE ON NIZAMABAD BJP MP DHARMAPURI ARAVIND FOR HIS LATEST COMMENTS ON JANASENA PARTY NK

Janasena: నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై జనసేన ఫైర్. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్

పవన్ కళ్యాణ్, ఎంపీ అరవింద్ (credit - twitter - Nithin PSPK Cult )

పవన్ కళ్యాణ్, ఎంపీ అరవింద్ (credit - twitter - Nithin PSPK Cult )

Janasena on Nizamabad MP: బీజేపీ కోరితోనే తెలంగాణలో జనసేన మద్దతు ఇచ్చిందనీ... తన వ్యాఖ్యల్ని ఎంపీ వెనక్కి తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది. అసలు వివాదమేంటి?

    Hyderabad GHMC Elections 2020: జనసేన పార్టీపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వాటిని ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది. ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కోరడం వల్లే... తెలంగాణలో పోటీని జనసేన విరమించుకొని... బీజేపీకి మద్దతు ఇచ్చిందన్న ఆ పార్టీ... ఎంపీ అరవింద్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదంది. "జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండి. అంతే తప్ప జనసైనికులను రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడటం సరికాదు. మీ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం" అని జనసేన ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేసింది.




    నిజానికి హైదరాబాద్ GHMC ఎన్నికల్లో జనసేన కూడా పోటీకి దిగాలని నిర్ణయించుకుంది. బీజేపీతో ఏపీలో మాత్రమే పొత్తు ఉంది కాబట్టి... తెలంగాణలో పోటీ పడాలనుకుంది. ఐతే... బీజేపీ పెద్దలు కోరడంతో... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నిర్ణయన్ని మార్చుకున్నారు. ఈసారి కలిసి సాగుదామనీ... బీజేపీకి మద్దతుగా ప్రచారం చేద్దామని జనసేన నేతలు, కార్యకర్తలను కోరారు. అందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు అయిష్టంగానే ఒప్పుకున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ అరవింద్... జనసేనను తక్కువ చేసి మాట్లాడటంతో... ఇది రాజకీయ రచ్చ రేపుతోంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా రేపు ఒక్కరోజే టైమ్ ఉంది. ఇంతలో అరవింద్ ఇలా మాట్లాడటం సరికాదని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఇది కూడా చదవండి: India Covid 19: ఇండియాలో తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు... 3 రాష్ట్రాలలో మాత్రం తీవ్రం

    ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా, చెప్పుకోతగ్గ స్థాయిలో సీట్లు సాధించినా... దాని వెనక జనసేన కూడా ఉన్నట్లే అంటున్నారు విశ్లేషకులు. జనసేన పార్టీ విడిగా పోటీ చేసి ఉంటే... ఓట్లు చీలిపోయేవనీ... తద్వారా అది టీఆర్ఎస్‌కి కలిసొస్తుందనీ అంచనా వేశారు. ఐతే... జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో... పొలిటికల్ సీన్... బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారిందంటున్నారు. మరి ఎంపీ అరవింద్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారో లేదో రెండ్రోజుల్లో తెలుస్తుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Dharmapuri aravind, Hyderabad, Hyderabad - GHMC Elections 2020, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు