• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • JANAREDDY MAY PLAY CRUCIAL ROLE IN GETTING TPCC CHIEF POST TO REVANTH REDDY AK

Revanth Reddy: రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి.. ఆ సీనియర్ నేత కీలకంగా మారతారా ?

Revanth Reddy: రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి.. ఆ సీనియర్ నేత కీలకంగా మారతారా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధిస్తే.. ఆయన కూడా టీపీసీసీ చీఫ్ రేసులోకి వస్తారని.. అలా కాకపోయినా టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయం ఆయన మాటకు ప్రాధాన్యత పెరుగుతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.

  • Share this:
    తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేసు మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది. ఇటీవల నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ రావడం.. సాగర్ ఉప ఎన్నికల తరువాత టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వేగవంతం చేస్తామని పార్టీ నేతలకు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేంతవరకు టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వాయిదా వేయాలని జానారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరారు. సీనియర్ నాయకుడు జానారెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసింది.

    అయితే సాధ్యమైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని ఆ పార్టీ నాయకత్వం ఉంది. దీంతో సాగర్ ఉప ఎన్నికలు పూర్తయిన వెంటనే మళ్లీ టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వేగవంతం అవుతుందనే ఊహాగానాలు మొదలయ్యయి. ఠాగూర్ మాటలతో ఈ విషయం నేతలకు కూడా అర్థమైంది. దీంతో మళ్లీ ఈ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు, వారి అనుచరుల్లో ఆసక్తి పెరిగింది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఈ పదవి దక్కుతుందా లేక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేదా జీవన్ రెడ్డికి టీపీసీసీ యోగం ఉందా అనే చర్చ మొదలైంది.

    సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధిస్తే.. ఆయన కూడా టీపీసీసీ చీఫ్ రేసులోకి వస్తారని.. అలా కాకపోయినా టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయం ఆయన మాటకు ప్రాధాన్యత పెరుగుతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు సాగర్‌లో జానారెడ్డిని గెలిపించుకోవడానికి మిగతా నేతలకంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. జానారెడ్డి గెలుపు రేవంత్ రెడ్డికి కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి మెరుగైన ఫలితాలు సాధిస్తే.. రేవంత్ రెడ్డిక టీపీసీసీ చీఫ్ పదవి దక్కే విషయంలో ఆయన కీలకంగా మారడం ఖాయమనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: