JANAREDDY COMMENTS ON HIS SON AND NAGARJUNA SAGAR CREATE NEW TENSION FOR TELANGANA CONGRESS AK
Telangana: మళ్లీ మెలిక పెడుతున్న జానారెడ్డి?.. కాంగ్రెస్కు కొత్త టెన్షన్
జానారెడ్డి (ఫైల్ ఫొటో)
Nagarjuna Sagar By Election: మరోవైపు ఈ ఎన్నికల్లో తన కుమారుడిని బరిలోకి దింపడం ద్వారా నాగార్జునసాగర్ సీటును తన కుమారుడికి రిజర్వ్ చేసినట్టు అవుతుందని.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు మిర్యాలగూడ స్థానం సిద్ధంగా ఉందని జానారెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి బరిలోకి దిగడం దాదాపు ఖాయమనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. అధిష్టానం రంగంలోకి దిగడంతో జానారెడ్డి ఇందుకు ఒప్పుకున్నారని.. ఆయన సూచన కారణంగా టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక వాయిదా పడిందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఆయన ఎన్నికల బరిలో తాను దిగుతారా లేక తన కుమారుడిని రంగంలోకి దించుతారా ? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. రాబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానని, తన కుమారుడిని సాగర్ బరిలో నిలబెట్టాలని అందరూ కోరితే స్వాగతిస్తానని జానారెడ్డి వ్యాఖ్యానించారు.
దీన్ని బట్టి ఆయన తన కుమారుడిని ఎన్నికల బరిలో దింపాలనే యోచన ఉందనే విషయం అర్థమవుతోందని కొందరు చర్చించుకుంటున్నారు. జానారెడ్డి సీనియర్ రాజకీయ నేత, ఆయన ఆలోచనలు కాంగ్రెస్ నేతలకు కూడా అంతుచిక్కవు. ఆయన అభిప్రాయాలు ఆయన సన్నిహితులకు కూడా అంతగా తెలియవు అంటారు. అలాంటి జానారెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల విషయంలో ఏం ఆలోచిస్తున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. జానారెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగితే కాంగ్రెస్ విజయం ఖాయమని.. ఆ రకంగా తెలంగాణలో పార్టీకి మళ్లీ జవసత్వాలు వస్తాయని కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే జానారెడ్డి కాకుండా ఆయన కుమారుడు బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఎవరూ ఊహించలేకపోతున్నారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో తన కుమారుడిని బరిలోకి దింపడం ద్వారా నాగార్జునసాగర్ సీటును తన కుమారుడికి రిజర్వ్ చేసినట్టు అవుతుందని.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు మిర్యాలగూడ స్థానం సిద్ధంగా ఉందని జానారెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే నాగార్జునసాగర్ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని.. చివరి నిమిషం వరకు ఆయన ఈ విషయంలో మౌనంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తన కుమారుడి పొలిటికల్ కెరీర్ విషయంలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్కు కొత్త టెన్షన్ క్రియేట్ చేసినట్టే కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.