దుబాయిలో ఉన్న భర్తకు పక్షవాతం.. సొంతూరికి తిరిగొచ్చాక అసలు నిజమేంటో అతడి భార్యకు తెలిసి..

న్యాయం చేయాలని కోరుతున్న బాధిత కుటుంబం

పొట్టకూటి కోసం, కుటుంబ కష్టాలు తీర్చేందుకు ఓ వ్యక్తి దుబాయికి వెళ్లాడు. దుబాయికి వెళ్లిన కొన్ని నెలలకే అతడికి పక్షవాతం వచ్చింది. దీంతో ఎలాగోలా సొంతూరికి తిరిగొచ్చాడు. అయితే స్వగ్రామానికి చేరుకున్నాకే ఆ వ్యక్తి భార్యకు ఓ నిజం తెలిసి..

 • Share this:
  గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే తెలంగాణ పౌరులు ఇప్పటికీ ఏజెంట్లనే నమ్ముకుంటున్నారు. వాళ్లకు లక్షల్లో డబ్బును ముట్టచెప్పి ఎలాగోలా గల్ఫ్ దేశాల బాటను పడుతున్నారు. కుటుంబ కష్టాలను తీర్చడం కోసం ఎడారి దేశాల్లో అష్టకష్టాలు పడుతున్నారు. అక్కడ ప్రమాదవశాత్తు మరణించినా, అనారోగ్యానికి గురయినా ఆదుకునేవారు లేక ఇబ్బందుల పాలవుతున్నారు. యజమానులు పెట్టే బాధలు భరించలేక, ఏజెంట్ల మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమను రక్షించాలంటూ గల్ఫ్ నుంచే వీడియో సందేశాలు పంపిస్తున్నారు. తాజాగా ఓ గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుల అక్రమ దందా కారణంగా తన భర్తకు లక్ష రూపాయల విలువైన ఆరోగ్య బీమా అందకుండా పోయిందని తమకు న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన ఒక మహిళ జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.

  జగిత్యాలకు చెందిన తండ్రీ కొడుకులు తంగెళ్ల గంగారాం, తంగెళ్ల సత్యం లు కార్తీక్ ఇంటర్నేషనల్ అనే పేరుతో గల్ఫ్ ఉద్యోగాల రిక్రూటింగ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. ఆ రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సును అడ్డంపెట్టుకొని అమాయకులైన కార్మికులను విజిట్ వీసాలతో  దుబాయికి పంపిస్తూ మోసం చేస్తున్నారని ఓ మహిళ ఆరోపిస్తోంది. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు మానవ అక్రమరవాణాకు పాల్పడుతున్నారని జగిత్యాలలోని జైన గ్రామానికి చెందిన కొక్కెరకాని గంగాజల  ఈనెల 2న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై  సిబిసిఐడి, సిబిఐతో పోలీసు దర్యాప్తు లేదా ఇతర పరిశోధన విభాగాలతో  విచారణ చేయించాలని ఆమె కోరారు.
  ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

  తానూ ఇచ్చిన దరఖాస్తుపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఆమె శనివారం (20.03.2021) సమాచార హక్కు చట్టం క్రింద జిల్లా కెలెక్టర్  కార్యాలయంలో ఒక దరఖాస్తు సమర్పించారు. తమకు న్యాయం చేయాలని మరో ప్రత్యేక దరఖాస్తు కూడా చేశారు. గంగాజల వెంట పక్షవాతంతో బాధపడుతున్న ఆమె భర్త పోశన్న వారి కుమారుడు కృతిక్ నందన్ (05), కూతురు మనస్విని (02), ఆమె తండ్రి రాజలింగు ఉన్నారు. దుబాయిలో పక్షవాతానికి గురై సంవత్సరం క్రితం స్వదేశానికి  తిరిగివచ్చిన  తన భర్త కొక్కెరకాని పోశన్నకు లక్ష రూపాయాల విలువైన వైద్య సహాయం  పొందలేకపోవడానికి ఏజెన్సీ నిర్వాహకులే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. తన భర్త వైద్య ఖర్చులు, ఇద్దరు చిన్న పిల్లల పోషణ భారంగా మారిందని ఆమె వాపోతోంది.
  ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్

  ఈసీఆర్ పాస్ పోర్టు కలిగిన పోశన్నకు చట్టబద్దంగా రూ.10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పాలసీ, ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమా పొందడానికి అర్హత ఉన్నదని ఆమె అన్నారు. గల్ఫ్ ఏజెన్సీ నిర్వాహకులు తమ వద్ద రూ.68 వేలు తీసుకొని పోశన్నను  దుబాయికి  విజిట్ వీజాపై పంపి మోసం చేశారని, ఒప్పుకున్న ప్రకారం బీమా పాలసీ జారీ చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న స్వదేశ్ పరికిపండ్ల ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
  Published by:Hasaan Kandula
  First published: