హోమ్ /వార్తలు /తెలంగాణ /

Unique Temple: ఆ దేవుడి పేరే దొంగ మల్లన్న .. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

Unique Temple: ఆ దేవుడి పేరే దొంగ మల్లన్న .. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

Donga Mallanna temple

Donga Mallanna temple

Jagityal:జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు పదికిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామం మల్లన్నపేట..ప్రతి ఏట డిసెంబర్ వచ్చింది అంటే ఊరంతా రోజు పండగే. ఎందుకంటే ప్రసిద్ది గాంచిన దొంగ మల్లన్న స్వామి గుడి అక్కడే ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మితమైన దేవస్థానం అది. మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుస్తాడని భక్తులకి అపారమైన నమ్మకం. ప్రతి ఏటా డిసెంబర్ (December)లో ఏడు వారాల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతున్న ఈ దేవస్థానం ఉమ్మడి కరీంనగర్ (Karimnagar)జిల్లా లోనే కాదు ఉమ్మడి రాష్ట్రాల నుంచి భక్తుల రాకతో సందడి నెలకొంది. ఇంతటి ప్రత్యేకత కలిగిన దేవస్థానం పేరు దొంగమల్లన్న ఆలయం(Dongmalanna temple). ఇది జగిత్యాల (Jagityal)జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. దొంగమల్లన్న దేవస్థానంపై న్యూస్18తెలుగు ప్రత్యేక కథనం.

Telangana Politics: పాలేరు నుంచే తుమ్మల పోటీ .. ఏ పార్టీ తరపున అంటే ..!

11వ శతాబ్ధపు నాటి ఆలయం..

దొంగమల్లన్న దేవస్థానం 11 వ శతాబ్దపు చివరి భాగంలో పొలాస పాలకులు నిర్మించారనే నానుడి ఉంది. పొలస పాలకులకు చెందిన కొన్ని ఆవులను కొందరు దొంగిలించి తీసుకెళ్తుండగా ఆ మార్గ మధ్యలో కొందరు చూశారని .... ఎక్కడ దొరికిపోతామేమోనన్న భయంతో .. మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి తమను గుర్తు పట్టకుండా ఆవుల రంగుల్లో మారిస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారని .. వారి మొక్కును మల్లన్నస్వామి తీర్చడంతో స్వామి వారికీ రాత్రికి రాత్రే గుడిని నిర్మించారని అంటుంటారు. అదే జగిత్యాల జిల్లాలో ప్రసిద్ది గాంచిన దొంగ మల్లన్న స్వామి గుడి.

గొల్లకురుమల ఆరాధ్య దైవం..

జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు పదికిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామం మల్లన్నపేట..ప్రతి ఏట డిసెంబర్ వచ్చింది అంటే ఊరంతా రోజు పండగే. ఎందుకంటే ప్రసిద్ది గాంచిన దొంగ మల్లన్న స్వామి గుడి అక్కడే ఉంది. మార్గశిర శుద్ధ పంచమిలో స్వామి వారి ఆలయంలో భక్తులు, గొల్లకురుమలతో నిండిపోయి ఉంటుంది. గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా ప్రసిద్ది చెందింది. స్వామివారిని దర్శించుకుంటే సకల భాదలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం షట్టి వారాల్లో భక్తులు భారీగా వస్తుంటారు. ప్రతిరోజు వచ్చే భక్తులతో గ్రామం జాతరగా మారుతుంటుంది .మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే షట్టి మొదలుకొని ఏడు వారాల పాటు తెలంగాణా వ్యాప్తంగా ఘనంగా జరిగే పండుగలో ఒకటి మల్లన్న బోనాల జాతర.

ఆది, బుధ వారాల్లో భక్తులతో కిట కిట..

ఇక ప్రతి ఆదివారం , బుధవారం రోజున అయితే ఊరంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే ప్రతి బుధ, ఆదివారాల్లో భక్తులు వేకువ జామునే లేచి ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈకాలంలో వచ్చిన పంటతో స్వామి వారికీ కొత్త కుండలో బోనాలను తయారు చేస్తారు. అనంతరం డప్పు చప్పుళ్ళతో స్వామి వారి ఆలయం చుట్టూ మూడు నుండి ఐదు ప్రదక్షణలు చేసిన తరువాత స్వామివారికీ వారు తయారు చేసిన బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

Telangana: ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన క్రేజ్ .. ఆర్టీఏ అధికారులకు భారీగా ఆదాయం .. ఎన్ని లక్షలంటే..?

జాతరకు లక్షల్లో వచ్చే భక్తులు..

స్వామి వారికీ దండి వారం ఎంతో ప్రీతి పత్రం కావడంతో ఆ రోజున ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.గొల్లకురుమల డప్పు వాయిద్యాలు , శివసత్తుల పునకాలతో ఏడువారాల పాటు ఆలయ ప్రాంగణం అంతా మార్మోతుంటుంది . దొంగ మల్లన్నగా పేరుగాంచిన ఈ ఆలయానికి ఏడువారాల్లో అయితే లక్షలాది మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జగిత్యాల జిల్లాతో పాటుగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , ఆదిలాబాద్ , వేములవాడ , కొండగట్టు దైవక్షేత్రాలకు వచ్చే వారు సైతం ఈ సీజన్ లో ఇక్కడికి వచ్చి మల్లన్నని దర్శించుకుని మెక్కులు చెల్లించుకోవడం అనవాయితీగా వస్తోంది.

First published:

Tags: Jagityal, Telangana News, Temple

ఉత్తమ కథలు