P.Srinivas,New18,Karimnagar
BRS మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ఎన్నికల పిటిషన్‌ను అమలు చేయడంలో విఫలమైనందుకు తెలంగాణ హైకోర్టు మంగళవారం మల్కాజ్ గిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)కి సమన్లు జారీ చేసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి భిక్షపతి ప్రస్తుతం పదవీ విరమణ చేసినా ఎన్నికల పిటిషన్‌పై సాక్ష్యాలను నమోదు చేసేందుకు హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ అమలు చేయాలని గతంలో జస్టిస్ కె. లక్ష్మ పోలీసులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారి BRS మంత్రికి అనుకూలంగా ఫలితాల షీట్‌ను మార్చారని ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థి తరఫు న్యాయవాది ధర్మేష్ వాదిస్తూ రిటర్నింగ్ అధికారి రెండుసార్లు హాజరైనప్పటికీ సంబంధిత పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారని, మరో రెండు సందర్భాల్లో హాజరు కాలేదని వాదించారు. పోలీసుల వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి మల్కాజ్ గిరి డీసీపీతో పాటు సంబంధిత పత్రాలతో మార్చి 27న కోర్టుకు హాజరుకావాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారంటూ ఆరోపిస్తూ రీకౌంటింగ్ చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే కౌంటింగ్ పిటిషన్ అమలు చేయడంలో విఫలమైనందుకు హైకోర్టు సీరియస్ అయింది.
ఈ విషయంలో మల్కాజ్ గిరి డీసీపీకి సమన్లు సైతం జారీ చేసింది. ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారిగా వ్యవహ రించిన (ప్రస్తుతం రిటైర్ అయ్యారు) బిక్షపతిపై అరెస్ట్ వారెంట్ అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే బిక్షపతి కోర్టుకు రెండుసార్లు గైర్హాజరవగా మరో రెండు సార్లు హాజరైనప్పటికీ పిటిషన్ పై సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో విఫలమయారని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ తరపున్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు మల్కాజ్ గిరి డీసీపీతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంబంధిత పత్రాలతో మార్చ్ 27న హాజరవ్వాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారిగా వ్యవహ రించిన బిక్షపతి శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, స్వల్ప ఓట్ల తేడాతో తాను ఓటమి చెందినట్లు తెలిపారు. కాబట్టే తన అనుమానం నివృత్తి చేసుకోడానికి రీకౌంటింగ్ చేయమన్నానే తప్ప ఎమ్మెల్యేగా ప్రకటించమని కోరలేదని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri, Elections