రష్మిక మందన్నాపై వివాదాస్పద ట్వీట్.. జగిత్యాల కలెక్టర్ వివరణ ఇదీ..

హీరోయిన్ రష్మిక మందన్నాపై జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రష్మిక తన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలకు ‘చించావ్‌ పో’ అని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు.

news18-telugu
Updated: February 20, 2020, 12:41 PM IST
రష్మిక మందన్నాపై వివాదాస్పద ట్వీట్.. జగిత్యాల కలెక్టర్ వివరణ ఇదీ..
జగిత్యాల కలెక్టర్ రవి, రష్మిక మందన్నా
  • Share this:
హీరోయిన్ రష్మిక మందన్నాపై జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రష్మిక తన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలకు ‘చించావ్‌ పో’ అని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. దీంతో ట్వీట్ వివాదాస్పదం అయ్యింది. ఉన్నత పదవిలో ఉండి ఇలాంటి కామెంట్లు చేయడమా అంటూ ఆయనపై నెటిజన్లు విమర్శలు సంధించారు. వెంటనే అప్రమత్తమైన కలెక్టర్ రవి.. ఆ ట్వీట్ తాను చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించి, తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని, విచారణ చేపట్టాలని కోరారు. కాగా, కలెక్టర్ ఖాతాను ఓ ఉద్యోగి హ్యాండిల్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. ఆ ట్వీట‌ను ఖాతా నుంచి తొలగించారు.
రష్మిక మందన్నా ఫొటోలకు ట్వీట్


First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు