హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: నేడే జగిత్యాలకు సీఎం కెసిఆర్ రాక..పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు

Karimnagar: నేడే జగిత్యాలకు సీఎం కెసిఆర్ రాక..పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

జగిత్యాల జిల్లాకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బుధవారం రానున్నారు. జగిత్యాల సమీకృత కలెక్టరేటు ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీ భవనణానికి శంకుస్థాపన, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ప్రారంభోత్సవం, అనంతరం మోతె శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచే కాకుండా కరీంనగర్ జిల్లా నుంచి కూడా జనసమీకరణ చేస్తున్నారు. రెండు లక్షల కుతగ్గకుండా జనాన్ని సమీకరించేదిశగా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ జగిత్యాల పర్య టన ముగించుకొని కరీంనగర్ కు చేరుకొని తీగలగుట్టపల్లెలోని తన నివాస గృహంలో బస చేయనున్నందున రెండు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి హరీష్ రావు రెండు దఫాలుగా పర్యటించి ఏర్పాట్లు సమీక్షించారు. జిల్లా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు ప్రత్యేకంగా సమీక్షలు జరిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimnagar

(P.Srinivas, New18, Karimnagar)

జగిత్యాల జిల్లాకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బుధవారం రానున్నారు. జగిత్యాల సమీకృత కలెక్టరేటు ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీ భవనణానికి శంకుస్థాపన, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ప్రారంభోత్సవం, అనంతరం మోతె శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచే కాకుండా కరీంనగర్ జిల్లా నుంచి కూడా జనసమీకరణ చేస్తున్నారు. రెండు లక్షల కుతగ్గకుండా జనాన్ని సమీకరించేదిశగా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ జగిత్యాల పర్య టన ముగించుకొని కరీంనగర్ కు చేరుకొని తీగలగుట్టపల్లెలోని తన నివాస గృహంలో బస చేయనున్నందున రెండు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి హరీష్ రావు రెండు దఫాలుగా పర్యటించి ఏర్పాట్లు సమీక్షించారు. జిల్లా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు ప్రత్యేకంగా సమీక్షలు జరిపారు.

Bhadradri Kothagudem: బూడిదమయం అవుతున్న గోదావరి తీరం

అన్ని హంగులతో కలెక్టరేట్ సమీకృత కలెక్టరేట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 2017లో కలెక్టరేట్ నిర్మాణాని కి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు 49.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్ కు చెందిన నవతేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కంపెనీ సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి2017 నవంబర్లో శ్రీకారం చుట్టింది. ధరూర్ క్యాంపు సమీపంలో కేటాయించి న 33.14 ఎకరాల స్థలంలో 8 ఎకరాల్లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం, అదనపు కలెక్టర్ కార్యాలయం, జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టర్ కార్యాలయం, 2877 చదరపు అడుగుల విస్తీర్ణంలో అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయం, 2130 చదరపు అడుగుల వైశాల్యంలో జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. ఇక జీ ప్లస్ 2 పద్ధతిలో 19,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లా స్థాయి అధికారుల గృహ సముదాయాలను నిర్మించింది. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారుల క్యాంపు కార్యాలయాలను దాదాపు రెండున్నరేళ్ల క్రితమే నిర్మించారు. వైద్యకళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ 2018 డిసెంబర్ ఎన్నికల ప్రచారం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులోనే భాగంగా జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ని మంజూరు చేసి నిర్మించారు.

Bhadradri Kothagudem: ఘనంగా 60వ హోంగార్డ్స్ దినోత్సవ వేడుకలు

ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు సెలవు..

సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని అన్ని ప్రైవేటు పాఠశాలు, కళాశాలల యాజమాన్యాలు సెల్ప్ హాలిడే ప్రకటించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రైవేటు విద్యాసంస్థల బస్సులన్నీ సీఎం సభకు జన సమీకరణ కోసం పంపించాలని అధికారుల నుండి వచ్చిన ఒత్తిడి వల్లనే పాఠశాలలు, కళాశాలలకు ఆయా యాజమాన్యాలు సెల్ఫ్ హాలిడే డిక్లేర్ చేసారని, ఇదేంటని అడిగితే సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించుకున్నట్టుగా ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తున్నాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

కెసిఆర్ పర్యటనను అడ్డుకుంటాము..

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గల ఏడు నియోజకవర్గాలలో పలు సమస్యల మీద గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పలు హామీలను నెరవేర్చక పోవడం పట్ల నిరసనగా ఈరోజు జగిత్యాల జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడ్డుకోవడానికి కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగిత్యాలకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

First published:

Tags: CM KCR, Congress, Karimnagar, Telangana

ఉత్తమ కథలు