హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: రేపు జగిత్యాల జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్..ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

Karimnagar: రేపు జగిత్యాల జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్..ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

 రేపు జగిత్యాల జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్

రేపు జగిత్యాల జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్

జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ సముదాయం, తెరాస పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవంతో పాటు, వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ జిల్లా కేంద్రానికి తొలిసారి వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురికి రెండుసార్లు, మెట్‌పల్లికి రెండుసార్లు వచ్చారు. ధర్మపురికి పుష్కరాల సందర్భంగా ఒకసారి రాగా ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మరోసారి వచ్చారు. మెట్‌పల్లికి రెండుసార్లు వచ్చినప్పటికి ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంట్లో జరిగిన కార్యక్రమాలకే వచ్చారు. రాయికల్‌లో జీయర్ ట్రస్ట్ కార్యక్రమంలో అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ సముదాయం, తెరాస పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవంతో పాటు, వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ జిల్లా కేంద్రానికి తొలిసారి వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురికి రెండుసార్లు, మెట్‌పల్లికి రెండుసార్లు వచ్చారు. ధర్మపురికి పుష్కరాల సందర్భంగా ఒకసారి రాగా ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మరోసారి వచ్చారు. మెట్‌పల్లికి రెండుసార్లు వచ్చినప్పటికి ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంట్లో జరిగిన కార్యక్రమాలకే వచ్చారు. రాయికల్‌లో జీయర్ ట్రస్ట్ కార్యక్రమంలో అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు.

Bhadradri Kothagudem: రూ.కోటికి పైగా ఖర్చుతో ముక్కోటి ఏకాదశి మహోత్సవ ఏర్పాట్లు!

నాలుగేళ్ల క్రితం రాంపూర్, రాజేశ్వర్‌రావు పేట పంప్ హౌజ్ పనులను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు దాటింది. రెండుసార్లు కార్యక్రమం ఖరారైనప్పటికి వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు వస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా మోతె శివారులో భారీ బహిరంగసభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమ బాధ్యతలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భుజాన వేసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు వచ్చి దిశానిర్దేశం చేశారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కవిత సైతం హరీష్ రావుతో కలిసి ఓసారి వచ్చారు.

Vizag: ఈ పంటతో అందం.. ఆరోగ్యమే కాదు.. రెట్టింపు ఆదాయం కూడా..? ఎలా సాగు చేయాలి..? పెట్టుబడి ఎంత..?

జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్, తెరాస జిల్లా అధ్యక్షుడు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేష్ బాబు తదితరులు తమ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 200 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ఇతర వాహనాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. రెండు లక్షల మంది అంచనాతో మోతె సమీపంలో సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, పాడి కాశిక్ ర్‌రెడ్డి, టి. భానుప్రసాదావు తదితరులు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.

అందరి దృష్టి.. జగిత్యాల సభపైనే..

అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెల పెద్దపల్లి పర్యటనలో జాతీయ పార్టీపై ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ ఈ నెల 7న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు ఎక్కువ కావడం, ఎమ్మెల్సీ కవిత ఈ నెల 6న విచారణ కు హాజరు కానుండటం, మరుసటి రోజే సీఎంతో కలిసి జగిత్యాల సభలో పాల్గొన నుండటంతో కేంద్రం తీరుపై కేసీఆర్ మరోసారి పోరుగడ్డ జగిత్యాల గడ్డ నుం చి గర్జించే అవకాశం లేకపోలేదు. కేంద్రంపై ఎలాంటి పోరాటం చేయనున్నారో ఇక్కడి నుంచి ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సీఎం రాకతో జగిత్యాల సభకు ప్రాధాన్యం సంతరించుకుంది.

First published:

Tags: CM KCR, Karimnagar, Telangana

ఉత్తమ కథలు