(P.Srinivas,New18,Karimnagar)
తెలంగాణ(Telangana)లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి (kondagattu anjanna)ఆలయంలో దోపిడీకి పాల్పడిన దొంగలను పోలీసులు (Police)పట్టుకున్నారు. సాంకేతికతను అంది పుచ్చుకుని గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించగలిగారు. కర్ణాటక(Karnataka)లోని బీదర్(Bidar)ప్రాంతానికి చెందిన ముఠాను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలుగా వెళ్లి ముఠాను పట్టుకున్నాయి. ఆలయం నుంచి ఎత్తుకెళ్లిన 9 లక్షల విలువ చేసే వెండి ఆభరణాల్లో రూ. 3.50 లక్షల విలువ చేసే వెండి వస్తువులను రికవరీ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.
దొరికారు దొంగలు..
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో గత నెల దోపిడీ జరిగింది. 23వ తేదీ అర్ధరాత్రి సమయంలో అంజన్న ఆలయంలో ఆలయం వెనక భాగం నుండి లోపలకు వెల్లిన అగంతకులు గర్భగుడి తాళాలను పగలగొట్టి అంజన్నకు చెందిన వెండి షటారీలు, మరకతంతో పాటు వివిధ రకాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. 24 తెల్లవారు జామున దోపిడీ దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ, క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించి ముఠాను గుర్తించారు. 10 బృందాలు జగిత్యాలలో సాంకేతికతను, క్లూస్ టీమ్స్ ద్వారా ముఠా ఆనవాళ్లను గుర్తించగా 24 గంటలు తిరగకముందే బీదర్ కు 4 టీమ్స్ చేరుకున్నారు.
సొత్తు రికవరీ ..
పవిత్ర ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగల ముఠా మొత్తంలో 9లక్షల విలువైన వెండి ఆభరణాలు దొంగలించారు. అయితే పోలీసులు నిందితుల నుండి ఒక వెండి గొడుగు. ఒక వెండి పెద్ద రామ రక్ష, రెండు ద్వారములకు గల కవచము ముక్కలు, ఒక మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా జగిత్యాల ఎస్సీ ఎగ్గిడి భాస్కర్ తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న విలువ రూ. 3.50 లక్షల విలువ చేసే వెండి వస్తువులను రికవరీ చేశామన్నారు.
ఆలయాలే ముఠా టార్గెట్..
టెంపుల్ చోరీ కేసులో బీదర్ జిల్లా హులియాద్ తండాకు చెందిన బాలాజీ కేశవ్ రాథోడ్, వశీరాంనాయక్ తండాకు చెందిన నర్సింగ్ జాదవ్ , విజయ్ కుమార్ రాథోడ్‌ను అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని ఎస్సీ భాస్కర్ తెలిపారు.ఈ ముఠా ఒక్క కొండగట్టు అంజన్న క్షేత్రమే కాకుండా పలు ఆలయాలే లక్ష్యంగా పెట్టుకుని దోపిడీలకు పాల్పడిందని ఎస్సీ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని చిలుపచేరు చాముండేశ్వరి ఆలయం, మహారాష్ట్రలోని పండరిపురం సమీపంలో కూడా దోపిడీలకు పాల్పడినట్టు తేలిందని వివరించారు. కొండగట్టు అంజన్న ఆలయంలో దోపిడీ ముఠాను పట్టుకోవడం సొత్తు రికవరి చేసిన టీంను జగిత్యాల ఎస్సీ భాస్కర్ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Jagityal, Telangana News