Home /News /telangana /

JAGITYAL YOUNG BOY WHO WAS ONCE AWARE OF PLANTING TREES IS NOW BEGGING FOR HOSPITAL EXPENSES AFTER BEING INVOLVED IN A ROAD ACCIDENT KNR PRV

Karimnagar: ఒకప్పుడు చెట్లను రక్షించమన్నాడు.. కానీ ఇప్పుడు తనను రక్షించమని  కోరుతున్న యువకుడు.. ఏం జరిగింది?

జగిత్యాల యువకుడు

జగిత్యాల యువకుడు

పర్యావరణాన్ని (Environment) కాపాడుకుందామంటూ ప్రజలకు అవగాహన కల్పించిన ఓ యువకుడు.. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో విగతజీవిగా ఉండి తనను కాపాడమని వేడుకుంటున్నాడు

    (Srinivas P, News18, Karimnagar)

    పర్యావరణాన్ని (Environment) కాపాడుకుందామంటూ ప్రజలకు అవగాహన కల్పించిన ఓ యువకుడు.. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో విగతజీవిగా ఉండి తనను కాపాడమని వేడుకుంటున్నాడు . జగిత్యాల (jagityal) జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన తూర్పాటి వెంకటేష్ ( 19 ) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు .చిన్ననాటి నుండే మొక్కలు నాటడం (Tree Plantation). వాటిని పెంచడం పాఠశాల స్థాయిలో ఉండగా ప్రభుత్వం ప్రారంభించిన హరితహారంలో పాల్గొని  వాటిని రక్షించాలని విస్తృత ప్రచారం చేశారు . శరీరమంతా చెట్ల ఆకులను కట్టుకుని ప్రతి రోజు ప్రజలకు అవగాహన కల్పించారు . కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకుంటూనే ఖాళీ సమయంలో వీడియో , ఫొటోగ్రఫర్గా పనిచేస్తున్నాడు . మూడు రోజుల కిందట పని నిమిత్తం హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న సమయంలో మోర్తాడ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి . ప్రస్తుతం నిజామాబాద్లోని (Nizamabad) ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు .

    వెంకటేష్


    చికిత్సకు సుమారు రూ .5 లక్షల వరకు అవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు . వెంకటేష్ తండ్రి కూలీ పనులు చేస్తుండగా తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తున్నారు . విషయం తెలుసుకున్న మెట్పల్లి బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు  స్పందించి సుమారు రూ .30 వేల వరకు అందించారు . ఆసుపత్రికి వెళ్లిన వారిని దీనంగా చూస్తూ తన ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నట్లు పలువురు తెలిపారు .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Help, Jagityal, Tree plantation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు