ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji) ఉన్నారు. ఇక బీజేపీ అగ్రనేత BL సంతోష్, కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్ కూడా ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా గతంలో కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్ లను విచారణకు రావాలని తెలంగాణ సిట్ నోటీసులు ఇచ్చింది. కానీ వారు విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో వారిపై సిట్ లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఇక తాజాగా సిట్ నోటీసులపై జగ్గుస్వామి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. తనకు ఇచ్చిన 41-A CRPC, లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఈ కేసుకు సంబంధం లేదని,అక్రమంగా నన్ను ఇరికించారని జగ్గుస్వామి పిటీషన్ లో పేర్కొన్నారు.
నలుగురు కాదు..40
అక్టోబర్ 26న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైలట్ రోహీత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిని పార్టీ మారాలని భారీ డీల్ ను నిందితులు తీసుకొచ్చారు. ఇది ఇప్పటివరకు బయటకు వచ్చిన నిజం. కానీ హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో అంశాలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. కేవలం నలుగురు ఎమ్మెల్యేలే కాదు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేలా ప్లాన్ చేసినట్టు నిందితుడు రామచంద్రభారతీ, BL సంతోష్ వాట్సప్ చాటింగ్ లో బయటపడినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని, మిగతా వారితో చర్చలు జరుపుతున్నట్టు సిట్ నివేదికలో పేర్కొంది. అలా అయితే విడతల వారిగా ఎమ్మెల్యేలను చేర్చుకోడానికి చూసినట్టు తెలుస్తుంది.
నిందితులకు బెయిల్..
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది హైకోర్టు. ప్రతీ సోమవారం సిట్ (Special Investigaion Team) ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రూ.3 లక్షల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్ పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లోద్దని హైకోర్టు (Telangana High Court) పేర్కొంది.
ఇక జగ్గుస్వామి వేసిన పిటీషన్ పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, Telangana High Court, Telangana News, TRS MLAs Poaching Case