హోమ్ /వార్తలు /తెలంగాణ /

Jaggareddy : నా పంచాయితీ అంతా రేవంత్ రెడ్డితోనే.. ఎన్ని కుట్రలు చేసినా పార్టీ వీడను...!

Jaggareddy : నా పంచాయితీ అంతా రేవంత్ రెడ్డితోనే.. ఎన్ని కుట్రలు చేసినా పార్టీ వీడను...!

Jaggareddy : ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బాధ్యతల నుండి తప్పించిన తర్వాత ఆయన స్పందించారు. తన పంచాయితీ కాంగ్రెస్ పార్టీతో కాదని, కేవలం పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మాత్రమేనని స్పష్టం చేశారు.ఎవరు కుట్రలు చేసిన తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అన్నారు.

ఇంకా చదవండి ...

  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీకి చెందిన అన్ని బాధ్యతలను తప్పిస్తూ అధిష్ఠానం సోమవారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తప్పొప్పులు మాట్లాడుకునే వీలుంటుందని, పదవుల కోతని స్పోర్టివ్‌గా తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ సోనియా, రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తానన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీతోనే మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాగా తన పంచాయితీ అంతా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మాత్రమేనని అన్నారు.

  రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఎవరితోనూ తనకు రాజకీయంగా విబేధాలు లేవని, తనపై సోషల్‌మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనకు తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నానంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్‌ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలను ఖండించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వంగా కక్షగట్టి తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తాను పీసీసీ పదవిని ఆశించానని, అయితే అధిష్థానం ఆ పదవిని రేవంత్‌కి కట్టబెట్టిందన్నారు.

  Hyderabad : నగర కమిషనరేట్‌ల పరిధిలో 100 కోట్లు దాటిన ట్రాఫిక్ చాలన్ల వసూళ్లు...

  ఇక రాహుల్ గాంధీతో పోట్లాడే స్థాయి తనకు లేనందువల్లే మౌనంగా ఉండిపోయానని అన్నారు... రాజీవ్ గాంధీని చంపిన హంతకులను కూడా క్షమించే పార్టీలో ఉండడం తన అదృష్టమని,అయితే కేంద్రస్థాయిలో నేతల వలే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లేరని అన్నారు. ఆయన ఒంటెద్దు పోకడలతో వెళుతున్నారని అందుకే తాను ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు.. అందరినీ కలుపుకొనిపోయే తత్వం రేవంత్ రెడ్డికి లేదని, అది పార్టీకి నష్టం చేస్తుందని అన్నారు. 20 రోజుల క్రితం రేవంత్‌ రెడ్డి తనకు ఫోన్‌ చేసి మెదక్‌ సీఎస్‌ఐ చర్చికి వెళ్తన్నట్లు చెప్పారని, అదే సమయంలో దామోదర రాజనర్సింహతో మరో రకంగా చెప్పారని తెలిపారు.

  మరోవైపు రేవంత్‌రెడ్డి మెదక్‌ పర్యటనకు వెళ్తే తనను ఆహ్వానించలేదని, అందుకే కోపం వచ్చిందని తెలిపారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశానని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను ఎదిరించిన ధైర్యవంతుడనని అన్నారు.. ఇలా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా?.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను కలుపుకొనిపోయే పద్ధతి లేదా? అంటూ ప్రశ్నించారు. ఇక ఏ ఆలోచన లేని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబుపై కూడా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  కాంగ్రెస్‌ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుందని, సోనియాగాంధీ కుటుంబం వల్లే పార్టీ గొప్ప స్థాయికి చేరిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

  First published:

  Tags: Hyderabad, Jaggareddy

  ఉత్తమ కథలు