ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ సినీ, ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేకంగా బర్త్ డే విషెష్ తెలియజేస్తూ.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది అనసూయ భరద్వాజ్. హ్యాపీ బర్త్ సీఎం సర్ అని.. హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సర్ అంటూ ట్వీట్ చేసింది. కేసీఆర్ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కువ మెజారిటీతో కైవసం చేసుకోవడం విశేషం. అంతేకాదు కేసీఆర్ తనదైన సంక్షేమ పథాకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచారు.
Happy birthday CM Sir!! #HappyBirthdayKCRsir https://t.co/C2lNmnyX2I
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 17, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, CM KCR, Jabardasth comedy show, KTR, Telangana