Home /News /telangana /

Governor tamilisai : కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఆమోదానికి మరింత సమయం .. కావాలి..

Governor tamilisai : కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఆమోదానికి మరింత సమయం .. కావాలి..

Governor tamilisai

Governor tamilisai

Governor tamilisai : టీఆర్ఎస్ పార్టీకి గవర్నర్ మరోసారి షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సిగా అమోదించేందుకు మరింత సమయం కావాలని అమె చెప్పారు. దీంతో ఆయన అభ్యర్థిత్వం ఖారారు చేయడం అనుమానంగానే కనిపిస్తుంది.

ఇంకా చదవండి ...
    గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కౌశిక్ రెడ్డి (koushik reddy ) అభ్యర్థిత్వాన్ని ఖారారు చేసేందుకు మరింత సమయం కావాలని మరోసారి స్పష్టం చేశారు గవర్నర్ తమిళిసై.. గవర్నర్ (Governor) కోటాలో అభ్యర్థుల అమోదంపై తాను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాని తెలిపింది.. ఓ టీవి చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో కౌశిక్ సభ్యత్వం ఖారారు పెండింగ్‌లో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కౌశిక్ రెడ్డి పేరును పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే.. తాజాగా మరోసారి సమయం కావాలని చెప్పడంతో ఆయన అభ్యర్తిత్వాన్ని అమోదించే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

    గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ( Governor tamilisai )ఈ సంధర్భంగా పలు అంశాలపై స్పందించారు. తాన పని తాను ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి, చెసుకుంటూ వెళుతున్నారని చెప్పారు. ముఖ్యంగా తాను చెపట్టబోయో ప్రజా దర్బార్ పై ఆమె స్పష్టం చేశారు. దాని వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. తాను మొదటి నుండి బీజేపీలో (BJP) పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేశానని, గవర్నర్ పదవిలో కూడా పలు గిరిజనుల జీవితాల అభివృద్దికి కృషి చేస్తున్నానని అన్నారు. ఇక తెలంగాణలో కూడా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాను ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్టు చెప్పారు. దీని వల్ల ఎవరికి నష్టం లేదని స్పష్టం చేశారు.. మరోవైపు తెలంగాణ విమోచన దినంపై తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తాను తెలుసుకున్నాని, గతంలో కూడా సీఎం కేసిఆర్ తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు.

    ఇది చదవండి :ఆర్టీసిని ఎట్టి పరిస్థితుల్లో మూసివేయం... చైర్మన్ బాజిరెడ్డి


    ప్రగతి భవన్‌కు, (pragathibavan )రాజ్‌భవన్‌కు (Rajbavan)మధ్య ఎలాంటీ విభేదాలు లేవని. ఎవరి భాద్యత వారికి ఉందని, అందుకే తన పరిధిలో తాను పని చేస్తున్నానని చెప్పారు. ఇందులో విభేదాలకు తావు లేదని స్పష్టం చేశారు. పరిపాలనలో ఏవేనా సమస్యలుంటే తాను ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు.

    ఇది చదవండి : ముంచుకొస్తున్న గులాబ్.. నగరంలో వర్షాలు అప్రమత్తమైన అధికారులు..


    ఈ ఇంటర్యూలో తన వ్యక్తిగత అంశాలపై కూడా ఆమె స్పందించారు. సాధారణంగా నాన్ వెజిటేరియన్ తింటానని అందులో ఎక్కువగా చేపలు ఇష్టంగా తింటానని చెప్పారు. ఇక రాత్రి సమయంలో ఎలాంటి భోజనం తీసుకోనని చెప్పారు. మధ్యాహ్నాం ఓట్స్ తీసుకుంటానని చెప్పారు. ఈ సంధర్భంలోనే చాల మంది కరెన్సి మీద పడి కేలరీల విషయం మర్చిపోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు కోవిడ్ (covid)నిబంధనలు పాటించాలని కూడా సూచించారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Governor Tamilisai, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు