టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. పాలనపరమైన, విధాన పరమైన వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని లీకేజీ కేసును విచారిస్తున్న సిట్ అభిప్రాయపడినట్టు సమాచారం. సర్వీస్ కమిషన్‌లో కీలక బాధ్యతలను ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన వారికి అప్పగించడం వల్లే లీకేజీ వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిట్(SIT) అంచనాకు వచ్చినట్టు టాక్. ప్రశ్న పత్రాల లీకేజీకి (TSPSC Paper Leak) సంబంధించి సిట్ చీఫ్,హైదరాబాద్ నగర ఆదనపు పోలీస్ కమిషనర్ ఆర్ శ్రీనివాస్ కేసు దర్యాప్తు నిమిత్తం పలు మార్లు నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చైర్మన్, కార్యదర్శితో పాటు వివిధ సెక్షన్ల అధికారులను సిబ్బందిని కలిసి కమి షన్ పనితీరు, విధులు బాధ్యతలపై అరా తీసినట్టు సమాచారం.
కమిషన్‌లో పలు ప్రధానమైన విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా ఎంపికైన వారితో నిర్వహిస్తున్న విషయాన్ని అయన గమనించినట్టు చెబుతున్నారు. ప్రశ్న పత్రాల తయారీకి అవలంబిస్తున్న విధానంతో పాటు వాటి కూర్పు, ఎంపిక ఎలా చేస్తారని కూడా అయన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నపత్రాల రహస్యాలన్నీ కిందిస్థాయి ఉద్యోగులకు అప్పగించి చేతులు దులుపుకున్నారన్న అభిప్రాయంతో సిట్ ఉన్నట్టు సమాచారం. కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఎన్ని విభాగాలున్నాయనే అంశంతో పాటు వివిధ సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది.
కమిషన్‌లో ప్రతి విభాగం చేసే కార్యకలాపాలు అత్యంత గో ప్యాంగా ఉండాలని కానీ ఆలా జరగడం లేదన్న అభిప్రాయాన్ని సిట్ చీఫ్ వ్యక్తం చేసినట్టు సమాచారం. విశ్వ విద్యాలయాలు, ఇంటర్ బోర్డు టెన్త్ క్లాస్ బోర్డు తరహాలో పరీక్షల నియంత్రణ అధి కరులు, సహాయ పరీక్షల నియంత్రణ అధికారులు కార్యదర్శులు డిప్యూ టీ అసిస్టెంట్ డైరెక్టర్లు సర్వీస్ కమిషన్‌లో ఉండగా అని అడిగినట్టు తెలు స్తోంది. కమిషన్ కార్యాలయంలో కంప్యూటర్ నెట్ వర్క్ అత్యంత బలహీనంగా ఉన్న అంశంపై కూడా సిట్ అరా తీసింది.
Govenor Tamilisai: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీపై గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించే జీతాలకు కేటాయింపులు తగ్గించడంతో ఆరుగురు పనిచేయాల్సిన స్థానంలో నలుగురితోనే కాలం వెళ్లదీస్తున్నట్టు సిట్ గుర్తించింది. ఎవరైనా ఉద్యోగి కంప్యూటర్ ల్యాన్లో ఎప్పుడు లాగిన్ అయ్యారు ? ఎప్పుడు లాగౌట్ అయ్యారు ? ఏఏ ఫైళ్లను పరిశీలించారు తదితర విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా రక్షణ వ్యవస్థ ఉండాలని.. కానీ తెలంగాణ కమిషన్లో అలాంటివేవీ లేవన్న నిర్ధారణకు సిట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కడ చూసినా విధానాల్లో లోపాలు స్పష్టంగా కనిపించాయని.. దీన్ని ఆసరాగా చేసుకునే నిందితులు ప్రశ్న పత్రాలను లీక్ చేశారన్న అభిప్రాయంతో సిట్ ఉన్నట్టు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, TSPSC Paper Leak