Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /తెలంగాణ /

మంత్రి మల్లారెడ్డి ఇంటి దగ్గర హైడ్రామా.. జోరుగా ఐటీ దాడులు.. మహేందర్‌రెడ్డికి ఛాతినొప్పి

మంత్రి మల్లారెడ్డి ఇంటి దగ్గర హైడ్రామా.. జోరుగా ఐటీ దాడులు.. మహేందర్‌రెడ్డికి ఛాతినొప్పి

మంత్రి మల్లారెడ్డి (File Photo)

మంత్రి మల్లారెడ్డి (File Photo)

Hyderabad : మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నేటి ఉదయం దాడులు ప్రారంభించగా.. మల్లారెడ్డి ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IT Rides : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆయన బంధువుల ఇళ్లలో వరుసగా రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి కొడుకు మహేందర్‌రెడ్డికి అస్వస్థత కలిగింది. ఛాతినొప్పి రావడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తన కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు సూరారంలోని ఆస్పత్రికి వెళ్లారు మంత్రి మల్లారెడ్డి. దాంతో.. మంత్రితో పాటు ఐటీ అధికారులు కూడా ఆస్పత్రికి వెళ్లారు. బీజేపీ రాజకీయ కక్ష తోనే ఐటీ దాడులు చేయిస్తోందన్న మల్లారెడ్డి.. తన కొడుకును ఐటీ అధికారులు కొట్టి ఉంటారనీ.. అందుకే ఇలా అయ్యిందని ఆరోపించారు.

నిన్నటి నుంచి దాడులు చేస్తున్న ఐటీ అధికారులు.. మల్లారెడ్డి ఇంటితోపాటూ.. ఆయన బంధువుల ఇళ్లలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. నిన్నంతా మల్లారెడ్డి ఇంటి దగ్గర ఆయన అనుచరులు ఆందోళన చేశారు. ఇంట్లో ఉన్న మల్లారెడ్డిని తమకు చూపించాలని డిమాండ్ చేశారు. దాంతో మల్లారెడ్డి బయటకు వచ్చి.. తాను బాగానే ఉన్నానని చెప్పారు. దాంతో నిన్న వెళ్లిపోయిన మద్దతుదారులు.. తెల్లారి మళ్లీ ఇంటికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ రాజకీయ అంశాలను పట్టించుకోని అధికారులు.. తమ తనిఖీలు కొనసాగిస్తున్నారు.

తెలంగాణాలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ విస్తృత తనిఖీలు కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ మంత్రులు టార్గెట్‌గా ఈ సోదాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు మంత్రి తలసాని టార్గెట్ గా అతని బ్రదర్స్, PAను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా ఆయన కొడుకు సాయికిరణ్‌కు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి టార్గెట్‌గా ఐటీ అధికారులు నిన్న తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు.

అమ్మాయిల రెస్ట్ రూంలో రహస్య కెమెరా పెట్టాడు.. కాలేజ్ స్టూడెంట్ అరెస్ట్

50 బృందాలు ఏకకాలంలో మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో భారీగా డబ్బును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లావాదేవీలపై భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కన్వీనర్ కోటా మెడికల్ సీట్లను కూడా కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. దీనితో మొత్తం 4 మల్లారెడ్డి మెడికల్ కాలజీల బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశిలీస్తున్నారు.

First published:

Tags: Malla Reddy, Telangana News

ఉత్తమ కథలు