హోమ్ /వార్తలు /తెలంగాణ /

అంతటా ముగిసిన ఐటీ సోదాలు .. మంత్రి మల్లారెడ్డికి నోటీసులు జారీ..

అంతటా ముగిసిన ఐటీ సోదాలు .. మంత్రి మల్లారెడ్డికి నోటీసులు జారీ..

మంత్రి మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

మంత్రి మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

Hyderabad : మంత్రి మల్లారెడ్డి, బంధువులు, స్నేహితుల ఇళ్లలో రెండు రోజుల ఐటీ సోదాలు ముగిశాయి. భారీగా డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆయనకు నోటీసులు ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IT Rides : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆయన బంధువుల ఇళ్లలో వరుసగా రెండో రోజుల పాటూ కొనసాగించిన ఐటీ సోదాలు ఇవాళ తెల్లవారుజామున ముగిశాయి. తెల్లారి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేసిన అధికారులు.. వాటిని కూడా ముగించారు. రెండు రోజులపాటూ.. 65 బృందాలుగా.. 400 మంది అధికారులు ఈ సోదాలు చేశారు. మొత్తంగా ఐటీ సోదాల్లో 10 కోట్ల 50 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రెండు సూట్‌ కేస్‌లు, 6 బ్యాగుల్లో వివిధ డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చిన అధికారులు... సోమవారం తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. అటు టర్కీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి.. ఇవాళ ఉదయం పది గంటలకు హైదరాబాద్ వస్తున్నారు. ఆయన ఇంట్లో రూ.3 కోట్లు లభించినట్లు తెలిసింది. అలాగే మల్లారెడ్డి బంధువు రఘునందన్ ఇంట్లో రూ.2 కోట్లు, త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, సుధీర్ రెడ్డి ఇంట్లో రూ.2.5 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.1 కోటి సాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ప్రధానంగా.. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ప్రభుత్వ రాయితీలు ఉన్నప్పటికీ అధికంగా ఫీజులు వసూలు చేశారని సమాచారం. అనధికార వసూళ్లను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా పెట్టినా.. వాటి వివరాలేవీ ఐటీ పత్రాల్లో చూపించలేదని తెలుస్తోంది. అందువల్ల అధికారులు... డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

మంత్రి మల్లారెడ్డి మాత్రం.. వందల కోట్లు అక్రమంగా పోగేసినట్లు ఐటీ అధికారులు.. పత్రాలు తయారుచేశారనీ.. వాటిపై సంతకం పెట్టమని తనను బలవంతం పెట్టారనీ.. తాను సంతకం పెట్టకపోవడంతో.. తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని ఆరోపించారు. ఐటీ అధికారి రత్నాకర్ పై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఐటీ దాడులు తనకు కొత్త కాదన్న ఆయన.. సీఎం కేసీఆర్ ఉండగా తనకు ఏమీ కాదన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా కేంద్రంలోని బీజేపీ చేయిస్తోందని ఆరోపించారు. తాము ఏ అక్రమాలకూ పాల్పడలేదనీ.. అనుకున్నదానికంటే తక్కువగానే ఫీజులు తీసుకుంటున్నామనీ.. ఎంతో మందికి ఉచిత సేవలు అందిస్తున్నామని అన్నారు.

అటు.. నిన్న రాత్రి మల్లారెడ్డి ఇంటికి వచ్చిన ఆయన మద్దతుదారులు.. ఆయన్ని చూపించాలని డిమాండ్ చేశారు. ఐటీ అధికారుల సమక్షంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మల్లారెడ్డి.. ఎవరూ ఆందోళన చెందవద్దనీ.. ఐటీ అధికారులు తమ పని తాము చేసుకుంటున్నారని అన్నారు. మల్లారెడ్డికి అండగా ఉంటామని తెలిపిన మద్దతుదారులు.. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

TTD : టీటీడీ కీలక ప్రకటన.. నేడు వృద్ధులు, దివ్యాంగులకు సర్వదర్శన టికెట్ల జారీ

మల్లారెడ్డి ఐటీ అధికారుల నోటీసుల ప్రకారం సోమవారం వారి ముందుకు వెళ్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. వెళ్తే.. అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఐటీ అధికారులు ఆయన్ని అరెస్టు చేస్తారనే వాదన వినిపిస్తోంది. అటు దీనిపై ఎలా ముందుకెళ్లాలనేదాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

First published:

Tags: Malla Reddy, Telangana News

ఉత్తమ కథలు