హోమ్ /వార్తలు /తెలంగాణ /

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు .. ప్రత్యేక నోటీసులు జారీ..

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు .. ప్రత్యేక నోటీసులు జారీ..

మంత్రి మల్లారెడ్డి (File Photo)

మంత్రి మల్లారెడ్డి (File Photo)

Hyderabad : మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో రెండు రోజులు సోదాలు చేసిన ఐటీ అధికారులు.. మల్లా రెడ్డి ఇంట్లో సోదాలు ముగించారు. ఆయనకు ప్రత్యేక నోటీసులు ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IT Rides : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆయన బంధువుల ఇళ్లలో వరుసగా రెండో రోజులు ఐటీ సోదాలు జరిగాయి. ఇవాళ కూడా బంధువుల ఇళ్లలో సోదాలు జరగనున్నాయి. మల్లారెడ్డి ఇంట్లో మాత్రం సోదాలు ముగిసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. రెండు రోజులపాటూ.. 65 బృందాలుగా.. 400 మంది అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఐటీ సోదాల్లో 10 కోట్ల 50 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మల్లారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు.. సోమవారం తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.

ప్రధానంగా.. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ప్రభుత్వ రాయితీలు ఉన్నప్పటికీ అధికంగా ఫీజులు వసూలు చేశారని సమాచారం. అనధికార వసూళ్లను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా పెట్టినా.. వాటి వివరాలేవీ ఐటీ పత్రాల్లో చూపించలేదని తెలుస్తోంది. అందువల్ల అధికారులు... డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా టర్కీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి.. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ వస్తున్నారు. అటు ఈ సోదాలపై నిన్నటి నుంచి మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన కొడుకు దగ్గర నుంచి బలవంతంగా సంతకం తీసుకున్నారని ఐటీ అధికారులపై ఆరోపణలు చేశారు. ఐటీ అధికారి రత్నాకర్ పై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా కేంద్రంలోని బీజేపీ చేయిస్తోందని ఆరోపించారు. తాము ఏ అక్రమాలకూ పాల్పడలేదనీ.. అనుకున్నదానికంటే తక్కువగానే ఫీజులు తీసుకుంటున్నామనీ.. ఎంతో మందికి ఉచిత సేవలు అందిస్తున్నామని అన్నారు.

అటు.. నిన్న రాత్రి మల్లారెడ్డి ఇంటికి వచ్చిన ఆయన మద్దతుదారులు.. ఆయన్ని చూపించాలని డిమాండ్ చేశారు. ఐటీ అధికారుల సమక్షంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మల్లారెడ్డి.. ఎవరూ ఆందోళన చెందవద్దనీ.. ఐటీ అధికారులు తమ పని తాము చేసుకుంటున్నారని అన్నారు. మల్లారెడ్డికి అండగా ఉంటామని తెలిపిన మద్దతుదారులు.. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు .. తెలంగాణలో కాస్త తగ్గిన చలి

మల్లారెడ్డి ఐటీ అధికారుల నోటీసుల ప్రకారం సోమవారం వారి ముందుకు వెళ్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. వెళ్తే.. అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఐటీ అధికారులు ఆయన్ని అరెస్టు చేస్తారనే వాదన వినిపిస్తోంది. అటు దీనిపై ఎలా ముందుకెళ్లాలనేదాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

First published:

Tags: Malla Reddy, Telangana, Telangana News

ఉత్తమ కథలు