IT MINISTER KTR FIRES ON TELANGANA BJP CHIEF BANDI SANJAY COMMENTS MS
GHMC Elections: ఆ పిచ్చి మాటలు మేం పట్టించుకోం.. బండి సంజయ్ వ్యాఖ్యలపై KTR ఫైర్
కేటీఆర్; బండి సంజయ్(ఫైల్ ఫోటో)
GHMC Elections: తెలంగాణ లో మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు (KTR) సంచలన కామెంట్స్ చేశారు.
జీహెచ్ఎంసీ (Greter Hyderabad Municipal corporation) ఎన్నికల వేళ రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. దుబ్బాక ఎన్నికల గెలుపు జోష్ మీదున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే అవకాశముందని ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఘాటు సమాధానమిచ్చారు. ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలని కొట్టి పారేశారు. ఎల్బీ స్టేడియంలో సీఎం సభ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ చేశారు.
భోలక్‌పూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుంది. మధ్యంతర ఎన్నికలు తప్పవు. కేసీఆర్‌పై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు. ఆయన జైలుకు పోవటం ఖాయం. అంటూ సంచలన కామెంట్స్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో.. ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే సందర్భంలో కేటీఆర్ ను విలేకరులు చుట్టుముట్టారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయా..? అనే ప్రశ్నపై ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చారు. కేటీఆర్ స్పందిస్తూ... ‘ఎవరో పిచ్చోడు మాట్లాడిన మాటలను మేం పట్టించుకోం...’ అంటూ కొట్టిపారేశారు.
ఎన్నికల ప్రచారం మొదలయినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటున్న బండి సంజయ్, బీజేపీ పై నేడు సీఎం కేసీఆర్ కూడా మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడం.. విగ్రహాలు కూలుస్తాననటం వంటివి పనికిమాలిన వాళ్లు మాట్లాడే మాటలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.