హోమ్ /వార్తలు /తెలంగాణ /

Universities in Telangana: తెలంగాణలో పేరుకే ఆ యూనివర్సిటీ.. ఆటలకు ప్రోత్సాహం ఏది?

Universities in Telangana: తెలంగాణలో పేరుకే ఆ యూనివర్సిటీ.. ఆటలకు ప్రోత్సాహం ఏది?

పాలమూరు విశ్వవిద్యాలయం

పాలమూరు విశ్వవిద్యాలయం

ఉమ్మడి పాలమూరు (Mahbubnagar) జిల్లా కు తలమానికమైన పాలమూరు విశ్వవిద్యాలయంలో ఆధునిక వసతులు కలిగిన క్రీడ మైదానం అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Sayyad rafi, News18, Mahbbunagar)

  ఉమ్మడి పాలమూరు (Mahbubnagar) జిల్లాకు తలమానికమైన పాలమూరు విశ్వవిద్యాలయంలో (Palamuru University) ఆధునిక వసతులు కలిగిన క్రీడ మైదానం అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది . ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ జోగులాంబ గద్వాల వనపర్తి పీజీ కేంద్రాల్లో మైదానాలు సరైన వసతులు లేవు ఫిజికల్ డైరెక్టర్లు వ్యాయామ అధ్యాపకులు శిక్షకులు కొరత తీరువంగా ఉంది ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ కళాశాలలో (Degree college) ఒక్కచోటనే పీడీ ఉన్నారంటే వసతిని అర్థం చేసుకోవచ్చు క్రీడల నిర్వహణ అంతం మాత్రంగానే ఉండడంతో విద్యార్థులు క్రీడా ప్రతిభ ఉన్న ప్రోత్సాహం లేక త్రిభుజంగా నష్టపోతున్నారు.

  పాలమూరు విశ్వవిద్యాలయంలో (Palamuru University) 2012- 13  సంవత్సరంలో కబడ్డీ వాలీబాల్ క్రాస్ కంట్రీ పరుగు పందెం పోటీలతో క్రీడ విభాగం ప్రారంభమైంది ప్రస్తుతం క్రీడల సంఖ్య 15 వరకు పెరిగిన ఆ విభాగంలో అతిథిగా పీడి పురుగు సేవల కింద వ్యాయామ అధ్యాపకుడు కంప్యూటర్ ఆపరేటర్ క్లర్క్ ఆఫీసు సబార్డినేట్ మార్కర్ జిమ్ ట్రైనర్ మాత్రమే పని చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీలో (Palamuru University)  క్యాంపస్ లో 2500 మంది వరకు విద్యార్థులు ఉన్నారు క్రీడల విభాగం జిమ్లో పరికరాలు పాతబడ్డాయి ఇండోర్లో సమస్యలు తాండవిస్తున్నాయి.

  క్రీడలకారుల అవసరాలు..

  పాలమూరు యూనివర్సిటీలో క్రీడా నిర్వహణకు ప్రత్యేకంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ 400 మీటర్స్ ట్రాక్ అవసరం కబడ్డీ కోకో వాలీబాల్ బాస్కెట్బాల్ తదితర ఆటలకు సింథటిక్ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలి ఫుట్బాల్ వాలీబాల్ కబడ్డీ క్రికెట్ క్రీడాకారులకు శిక్షకులను నియమించాలి వీటితో పాటు ప్రతి డిగ్రీ ఇంటర్ కళాశాలలో శిక్షకుడు ఉండేలా చర్యలు చేపట్టాలి పిజి సెంటర్లోనూ ఆట స్థలాలు సిందెట్టి ట్రాక్ పరికరాలు సింది టెక్ మాథ్స్ తదితర ఆధునిక సౌకర్యాలు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

  బాధ్యతలు చేపట్టాక ప్రత్యేకంగా దృష్టి: యూనివర్సిటీ ఉప కులపతి..

  నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పలగం యూనివర్సిటీ ఉప కులపతి,  ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు. అంతేకాక కోచ్ లేని మాట వాస్తవమేనని, జిల్లా వాడిగా క్రీడాకారుడిగా పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టాక ప్రత్యేకంగా దృష్టి సారించానని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర క్రీడల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ షార్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి సహకారంతో వచ్చే ఏడాది అఖిలభారత్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఈ ఏడాది సీఎం కప్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. రూ 10 కోట్లతో ఇండోర్ మల్టీ పర్పస్ హాల్ రూ 9 కోట్లతో సిండిటిక్ అథెంటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాస్కెట్​బాల్​ బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటుకు రూ 24 లక్షలతో టెండరు ఆహ్వానించామని తెలిపారు. సౌకర్యాలు సమకూర్చితే కోర్టులను కూడా నియమించుకోవచ్చు అని లక్ష్మీకాంత్ అన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Games, Mahbubnagar, University

  ఉత్తమ కథలు