హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: నకిలీ విత్తనాల విక్రయాల వెనుక అధికార పార్టీ నేతలు..? కేసులను తారుమారు చేసే ప్రయత్నం..! ఎక్కడంటే..

Telangana: నకిలీ విత్తనాల విక్రయాల వెనుక అధికార పార్టీ నేతలు..? కేసులను తారుమారు చేసే ప్రయత్నం..! ఎక్కడంటే..

పట్టుబడిన నకిలీ విత్తనాలు

పట్టుబడిన నకిలీ విత్తనాలు

Telangana: తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అధికార పార్టీ నాయకులు వారిపై కేసులు నమోదు కాకుండా చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. అంతే కాకుండా అధికారులను కూడా భయాందోళనకు గురిచేస్తున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి ...

(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

ఏదైనా కంపెనీ లో కాలంచెల్లిన విత్తనాలు దొరికితే ఆ కంపెనీ యజమాని పై కేసు నమోదు చేయడం ఆనవాయితీ. జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు మాత్రం ఇక్కడ దొరికిన కంపెనీ యజమానిపై కాకుండా మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు జోగులాంబ గద్వాల జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి విత్తనాలు కు పెట్టింది పేరు. పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి విత్తనాల కొనుగోలు జరుగుతాయి. కాలం చెల్లిన నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్పి సారథ్యంలో టాస్క్ ఫోర్స్ టీములు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం టీంలు మల్దకల్ మండలం మద్దెలబండ చిన్న తండా శివారులో గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పొలం దగ్గర దాచి ఉంచిన 150 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.

గద్వాల మండలం లోని గుంటుపల్లి గ్రామానికి చెందిన కురువ జయన్న ఇంట్లో సోదాలు నిర్వహించి 120 కిలోల విత్తనాలను పట్టుకున్నారు అతనిపై కూడా కేసు నమోదు చేశారు. కాగా గద్వాల పట్టణ సమీపంలో ఉన్న రమ్య కంపెనీలో అధికారులు దాడులు నిర్వహించి వేల సంఖ్యలో కాలం చెల్లిన నకిలీ విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కంపెనీ యజమానిపై కాకుండా విజయ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పై కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.

ఇందుకు సంబంధించి రాష్ట్రస్థాయి ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవడం వల్ల కేసును తారుమారు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార బలం ఉన్నవారిపై కేసు నమోదు చేయకుండా మిగతా వారిపై కేసు నమోదు చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Fake seeds, Farmers, Leaders, Mahabubnagar, Task Force Police, TRS leaders

ఉత్తమ కథలు