(Balakrishna, news 18, telugu )
కోవిడ్ కారణంగా దాదాపు 20 నెలలు హైదరాబాద్ లో ఉన్న ఐటీ కంపెనీలన్ని వర్క్ ఫ్రమ్ హోం కు గుడ్ బై చెప్పాలకున్నాయి దీపావళి తరువాత దాదాపు అన్ని ఐటీ కంపెనీలు తమ కార్యకాలపాలను ఆఫీస్ నుంచే ప్రారంభించాడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. తమ ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశాయి. బ్యాక్ టూ నార్మల్ కు వద్దమనుకున్న తరుణంలో మళ్లీ కోవిడ్ న్యూ వేరియట్ ఇప్పుడు నగరంలో ఉన్న కంపెనీలను ఎటూ తేల్చుకో లేకుండా చేస్తోన్నాయి.
కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వలన కార్యాలయాలు రీ ఓపెన్ చేయాలా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మారింది కంపెనీ యాజమాన్యాలు. “దీపావళి తర్వాత ఆఫీస్లు తెరవడం ప్రారంభించినప్పటికీ, అది ఇప్పటికీ పూర్తి స్థాయి కార్యచరణలోకి రాలేదు. తొలుత జనవరిలో కార్యాలయాన్ని ప్రారంభించవచ్చని రెడీ గా ఉండమని కంపెనీ తెలియజేసింది. అయితే ఈ కొత్త వేరియంట్ వలన మళ్లీ ఏం జరుగుతుందో అనే డైలమాలో పడేసింది. మా ఆఫీసు అధికారికంగా ఎటువంటి కమ్యూనికేట్ చేయనప్పటికీ, పరిస్థితిని బట్టి కార్యాలయానికి తిరిగి రావడాన్ని వాయిదా వేయాలనే గుసగుసలు ఉన్నాయి.” అని న్యూస్ 18 కి తెలిపారు నగరంలో ప్రముఖ ఎమ్ఎన్సీ కంపెనీలో పని చేస్తోన్న ఉద్యోగి రమేష్.
కార్యాలయాలను తెలరుస్తారా లేదా అనే డైలామా ఒక్క రమేష్ లోనే కాదు నగరంలో ఐటీ కంపెనీల్లో పని చేస్తోన్న చాలా మందిలో ఉంది. వాస్తవానికి నగరంలో ప్రస్తుతం ఆఫీసు నుండి పనిచేసే ఉద్యోగుల శాతం పెద్ద కంపెనీలకు 5 శాతం, మధ్యతరహా కంపెనీలకు 30 శాతం, చిన్న కంపెనీలకు 70 శాతంగా ఉంది. అయితే ప్రస్తుతానికి కొత్త వేరియంట్ ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించకపోవడంతో కంపెనీలు వేచి చూసే దోరణిలో ఉన్నాయి. మళ్లి ఇప్పుడు ప్రభావం లేదు కదాని ఇప్పుడు ఆఫీస్ నుంచి కార్యకాలాపాలు ప్రారంభిస్తూ మళ్లీ ఈ కొత్త వెేరియంట్ విజృంబిస్తే పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నాయి నగరంలో ఉన్న చాలా కంపెనీలు.
అయితే నగరంతోపాటు దేశవ్యాప్తంగా కొత్త వేరియట్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు అవుతున్న నేపధ్యంలో వచ్చేనెల వరకు వేచి చూచి అప్పుడు పరిస్థితిని బట్టి ఈ అంశంపై నిర్ణయం తీసుకుందామని చాలా కంపెనీలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వర్క్ ఫ్రమ్ హోం వలన కంపెనీలకు ఖర్చులు తక్కవ అవుతున్నా.. పని లో నాణ్యత తగ్గుతుందన్న అభిప్రాయాలు మరో వైపు వినిపిస్తోన్నాయి. అయితే కోవిడ్ కొత్త వేరియంట్ పై జనవరి మధ్యలో లేదా ఫిబ్రవరిలో మాత్రమే దిని ప్రభావం ఎంతనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంచన వేస్తోన్నారు నిపుణులు. మరో వైపు రాబోయే రెండు నెలల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతాయని డాక్టర్లు హెచ్చరిస్తో్న్న నేపథ్యంలో ఐటీ కంపెనీలుల్లో డైలామాకి మరో ప్రధాన కారణంగా ఉంది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, It, Work From Home