సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసులో ట్విస్ట్

IT Grid Case | పోలీసు విచారణకు హాజరవుతానంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్.

news18-telugu
Updated: June 20, 2019, 4:37 PM IST
సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసులో ట్విస్ట్
టీడీపీ సేవామిత్ర యాప్, ఐటీ గ్రిడ్స్ లోగో, ఓటర్ ఐడీ కార్డులు
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో కీలక నిందితుడు, ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ ఎట్టకేలకు దిగొచ్చారు. పోలీసు విచారణకు హాజరవుతానంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. అయితే విచారణలో భాగంగా సిట్ ఎదుట హాజరుకావాలని పోలీసులు సూచించారు. దీంతో గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట విచారణకు అశోక్ హాజరుకానున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు గోషామహాల్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ ప్రజల డేటాను టీడీపీ చోరీ చేసిందంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది. డేటా గ్రిడ్ సంస్థకు అనధికారికంగా ఇచ్చారంటూ ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌లో ఉన్న ఐటీ గ్రిడ్ కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులలో ప్రజలకు సంబంధించిన కీలక డేటా స్వాధీనం చేసుకున్నారు. డేటా చోరీ అంశం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణకు సిట్ ను నియమించింది. సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కానీ అశోక్ విచారణకు హాజరుకాలేదు. అయితే ముందస్తు బెయిల్ కోసం ఇటీవలే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ సిట్ విచారణకు సిద్ధమవ్వడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

First published: June 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు