నయీమ్ కుటుంబసభ్యులకు ఐటీ శాఖ నోటీసులు

నయీమ్ తల్లి తహేరాబేగం, సోదరి సలీమా, భార్య హసీనా బేగం, అతని అనుచరుడు పాశం శ్రీనివాస్ పేరిట నోటీసులు జారీ అయ్యాయి.

news18-telugu
Updated: February 25, 2020, 3:24 PM IST
నయీమ్ కుటుంబసభ్యులకు ఐటీ శాఖ నోటీసులు
గ్యాంగ్‌స్టర్ నయీమ్(ఫైల్ ఫోటో)
  • Share this:
పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబసభ్యులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం భువనగిరిలోని నయీమ్ ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించారు. నయీమ్ తల్లి తహేరాబేగం, సోదరి సలీమా, భార్య హసీనా బేగం, అతని అనుచరుడు పాశం శ్రీనివాస్ పేరిట నోటీసులు జారీ అయ్యాయి. చాలాకాలం తరువాత మళ్లీ గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యవహారంలో కదలిక రావడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది చివరిలో గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువకు సంబంధించి ఇందుకోసం ఏర్పాటు సిట్ కీలక ప్రకటన చేసింది.

నయీమ్‌కు రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని వెల్లడించింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. వేయి 15 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలున్నాయని, మొత్తం 29 భవనాలు ఉన్నాయని వెల్లడించారు. 1.90 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 2.8 కోట్ల నగదున్నాయని తెలిపారు. 258 సెల్ ఫోన్లు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలున్నాయని, మారణాయుధాలున్నాయని సిట్ అధికారులు తెలిపారు.

First published: February 25, 2020, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading