టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డికి ఐటీ బిగ్ షాక్ ఇచ్చింది. ఆదాయం మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఐటీ అధికారులు తెల్లవారుజాము నుండే మల్లారెడ్డి ఇళ్లలో, కార్యాలయాలతో పాటు ఆయన కుమారుడు, అల్లుడు, సోదరుని ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను అధికారులు స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన ఫోన్ ను పక్కన ఉన్న క్వార్టర్స్ లో దాచినట్లు తెలవగా దానిని అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మల్లారెడ్డి సోదరుని ఇంట్లో ఓ లాకర్ ను గుర్తించిన అధికారులు దానిని బయటి వ్యక్తి సహాయంతో పగలగొట్టారు. ఆ లాకర్ లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
రూ.2 కోట్ల నగదు సీజ్..
ఇక తాజాగా మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఉదయం నుండి సుచిత్రాలోని త్రిశూల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు నగదును సీజ్ చేశారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఇవాళ ఉదయం 5 గంటలకు మెరుపు దాడులు చేసినట్లు తెలుస్తుంది. మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు అతని కుమారుడు, అల్లుడు ఇళ్లలోనూ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో, విద్యాసంస్థల్లో, ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబసభ్యుల ఫోన్ లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఎవరిని బయటకు పంపించడం కానీ బయటి వ్యక్తులను లోపలికి పంపించడం లేదు. ఈ సోదాల్లో భాగంగా బాలానగర్ లో క్రాంతి బ్యాంక్ లో మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు తెలియగా ఆ బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. సుమారు 6 గంటల నుంచి రైడ్స్ జరుగుతుండగా ఇవి సాయంత్రం వరకు కంటిన్యూ అయ్యేలా కనిపిస్తున్నాయి. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
కన్వీనర్ సీట్లు కోట్లకు అమ్మకాలు..
మల్లారెడ్డికి సంబంధించిన విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ కార్యాలయాలు, అతని బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లావాదేవీలపై భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. కాగా కన్వీనర్ కోటా మెడికల్ సీట్లను కూడా కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది. దీనితో మొత్తం 4 మల్లారెడ్డి మెడికల్ కాలజిల బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశిలీస్తున్నారు. అలాగే 14 విద్యాసంస్థల్లోనూ అధికారులు రైడ్స్ జరుగుతున్నాయి. ఇక మల్లారెడ్డి ఇంట్లోనూ ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన సమక్షంలోనే ఈ రైడ్స్ జరుగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, Mallareddy, Telangana