మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం...దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రత్యేక గుర్తింపు...

రాష్ట్ర స్థాయి ఆహ్వానితుల్లో ఈ సమావేశానికి హాజరైన లీడర్‌ కేటీఆర్ ఒక్కరే ఉండడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. ఈ సమావేశం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక బ్యాడ్జ్‌ను అందించింది.

news18-telugu
Updated: January 23, 2020, 11:09 PM IST
మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం...దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రత్యేక గుర్తింపు...
దావోస్ లో మంత్రి కేటీఆర్
  • Share this:
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. “కీపింగ్ పేస్ టెక్నాలజీ- టెక్నాలజీ గవర్ననెన్స్ ఏట్ క్రాస్ రోడ్స్” పేరుతో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. సాధారణంగా ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ పాలసీ నిర్ణయించే సీనియర్ మంత్రులు మాత్రమే హాజరవుతారు. రాష్ట్ర స్థాయి ఆహ్వానితుల్లో ఈ సమావేశానికి హాజరైన లీడర్‌ కేటీఆర్ ఒక్కరే ఉండడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. ఈ సమావేశం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక బ్యాడ్జ్‌ను అందించింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేక ఆహ్వానం పంపింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, సీనియర్ కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సెర్బియా ప్రధానమంత్రి అనా బ్రనాబిక్, పోలాండ్ ప్రధాని మాటుస్జ్ మొరవిక్కీ, ఈస్టోనియా ప్రధాన మంత్రి జూరీరాటాస్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేషియా, బోట్స్ వానా, ఒమన్, ఇథియోపియా దేశాలకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.







First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు