ISO certified village: ఇతర గ్రామాలకు ఆదర్శంగా.. ఆ గ్రామానికి అంతర్జాతీయ స్థాయి ఐఎస్ఓ గుర్తింపు.. ఎక్కడంటే..

ISO certified village: ఇతర గ్రామాలకు ఆదర్శంగా.. ఆ గ్రామానికి అంతర్జాతీయ స్థాయి ఐఎస్ఓ గుర్తింపు.. ఎక్కడంటే..

ఐఎస్ఓ గుర్తింపు పత్రం

ISO certified village: ఒక గ్రామం అన్నింటిలో ఉన్నత ప్రమాణాలను పాటించినందుకు అంతర్జాతీయ ప్రమాణాల ఆర్గనైజేషన్(ఐఎస్ఓ) గుర్తించడం అనేది తెలంగాణలో తొలిసారి. ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన తొలి గ్రామంగా సిద్దిపేట జిల్లా లోని  ఇర్కోడ్ నిలిచింది. దీంతో గ్రామ పాలకులను మంత్రి హరీశ్ రావు, ఇతర నాయకులు అభినందించారు.

  • Share this:
    ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ... ఉత్తమ గ్రామంగా పేరుపొందిన  సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్  గ్రామాన్ని అంతర్జాతీయ ప్రమాణాల ఆర్గనైజేషన్ (ISO) గుర్తించింది. ఈ సందర్భంగా సంస్థ సర్టిఫికెషన్ ఇస్తూ ఎంపిక అయినట్లు ప్రకటించింది. iso కు ఎంపిక అయిన రాష్ట్రంలో తొలి గ్రామంగా ఇర్కోడ్  ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామం అన్నింటిలో ఉత్తమం అని.. ఉన్నత ప్రమాణాలను పాటిస్తుందని అందుకు అంతర్జాతీయ ప్రమాణాల ఆర్గనైజేషన్ ఎంపిక చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇర్కోడ్ గ్రామం లో గ్రామపంచాయతీ పౌర సేవలు , గృహ అనుమతులు , లే ఔట్స్ అనుమతులు , ఆస్తుల మార్పు , సమర్తవంతమైన నీటి నిర్వహణ , రోడ్లు , పారిశుద్ధ్య నిర్వహణ , తడి పొడి చెత్త సేకరణ , మొక్కల పెంపకం , పాఠశాల భవనాల నిర్వహణ , పన్నుల వసూలు , ప్రభుత్వ పథకాలు సక్రమంగా నిర్వహణ కు గాను ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ గ్రామం ఆదర్శంగా నిలిచింది. అందుకు గాను iso సంస్థ గ్రామాన్ని గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చింది. ఇది రాష్ట్రంలో నే తొలి గ్రామంగా గుర్తింపు తెచ్చుకుంది.

    భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యం..
    గ్రామ ప్రజల ఐక్యత.. ప్రతి పనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏదైనా సాధ్యమని ఇర్కోడ్ గ్రామం నిరూపించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇర్కోడ్ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని.. అన్ని గ్రామాలు ఇర్కోడ్ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఈ గుర్తింపు రావడంలో భాగస్వామ్యం అయిన ప్రజలు, ప్రజాప్రతినిధులను అధికారులను ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అభినందించారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు