• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • IS TRS DECIDED TO FACE ONE MORE BY ELECTION IN TELANGANA IF ETELA RAJENDAR RESIGN FOR MLA POST AK

Telangana: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ ముందే రెడీ అవుతోందా ?

Telangana: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ ముందే రెడీ అవుతోందా ?

తెలంగాణ మ్యాప్

Etela Rajendar: తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే విషయంలో ఈటల రాజేందర్ ఏ మాత్రం తొందరపడటం లేదని.. హుజూరాబాద్‌లోని తన అనుచరులు, ప్రజలతో చర్చించిన తరువాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    తెలంగాణ కొన్ని నెలల నుంచి ఉప ఎన్నికలు వచ్చిపడుతున్నాయి. గతేడాది టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది. గతేడాది మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. వీటిలో దుబ్బాక సీటును బీజేపీ సొంతం చేసుకోగా.. నాగార్జునసాగర్ స్థానాన్ని టీఆర్ఎస్ నిలబెట్టుకుంది. అయితే తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు.. రానున్న నెలల్లో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అవినీతి ఆరోపణల కారణంగా మంత్రి పదవి కోల్పోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. రేపో మాపో తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

    తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే విషయంలో ఈటల రాజేందర్ ఏ మాత్రం తొందరపడటం లేదని.. హుజూరాబాద్‌లోని తన అనుచరులు, ప్రజలతో చర్చించిన తరువాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పదే పదే తన ఆత్మగౌరవాన్ని వదులుకోనని ప్రకటిస్తున్న ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ ద్వారా తనకు వచ్చిన ఎమ్మెల్యే పదవికి సాధ్యమైనంత తొందరగానే రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. అదే జరిగితే తెలంగాణలో మరో ఆరు నెలల్లోపు మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

    అయితే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే అది పూర్తి భిన్నంగా ఉంటుందని... అప్పుడు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో కూడా ఊహించలేమనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మరో ఉప ఎన్నిక వస్తుందనే విషయాన్ని టీఆర్ఎస్ అధినాయకత్వం ముందుగానే ఊహిస్తుందని.. అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన కూడా సిద్ధం చేసుకుని ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: