Eetala Rajendar : ఈటల తేరుకోకముందే నియోజకవర్గంలో పాగా వేయాలా.. టీఆర్ఎస్‌లో వ్యూహం

ఉమ్మడి పోరాటమే బెటర్ , అప్పుడే కేసిఆర్‌ను ఎదుర్కోగలం

Eetala Rajender : ఈటలను పార్టీ నుండి పంపించిన తర్వాత ఆయన నియోజవర్గంలో ఏంజరుగుతుంది. పార్టీ బలాన్ని పెంచుకునేందుకు టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలకు గాలం వేస్తుందా..హుజురాబాద్ టీఆర్ఎస్ స్థానాన్ని ఎవరు భర్తి చేస్తారు ?

 • Share this:
  ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో తరువాత పరిణామాలపై ఉమ్మడి జిల్లాలో చర్చ జోరుగా జరుగుతోంది . సీనియర్ నేతను అవమానకర రీతిలో మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోవడం లేదు . ఇంత జరిగిన తరువాత పార్టీలో కొనసాగడం అవసరమా అని సన్నిహితు లు ప్రశ్నిస్తున్నారు . ఒకటి రెండు రోజుల్లో పార్టీకి రాజీనామా చేసి , తన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని హుజూరాబాద్ కు చెందిన ఓ నాయకుడు పేర్కొన్నారు .

  ఈలోపు హుజూరాబాద్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా టీఆర్ఎస్ అధిష్టానం ఈటల విషయంలో తీసు కుంటున్న చర్యలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఇతర పార్టీల నేతలు ఆయనతో టచ్ లో ఉన్నారు . కాంగ్రెస్ నుండి బట్టి, రేవంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్, బీజేపీ నుండి ఎంపీ అరవింద్, ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఈటల సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి . అదే సమయం లో ఈటల తన వర్గీయులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు . తాను తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి తన తో కలిసి వచ్చేవారెవరు ? టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని పక్కకు తప్పుకునే వారెవరు ? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలిసింది .

  ఇది ఇలా ఉంటే  హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారా? ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇదే నిజం అనిపిస్తున్నది. పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక నేతలను ఆదేశించినట్లు తెలిసింది.

  ఈ మేరకు జిల్లాకు చెందిన ఒక మంత్రి కౌశిక్ రెడ్డి తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలో ఈటెల ను డీ కొట్టాలంటే కౌశిక్ రెడ్డి తప్ప మరో మార్గం లేదని కెసిఆర్ కు సదరు మంత్రి తెలిపినట్లు సమాచారం. దీంతో కౌశిక్ రెడ్డి ని పార్టీ లోకి చేర్చుకునేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈటెల తేరుకుని పార్టీ కి నష్టం చేసే లోపే ఇంఛార్జి ని నియమించి క్యాడర్ ను కాపాడుకోవాలని భావిస్తూ పావులు కదుపుతున్నారు.

  అంతవరకు నిత్యం ఈటెల వెంట ఉండే కొంతమంది సెకండ్ క్యాడర్ నాయకులతో కెసిఆర్ డైరెక్ట్ గా అవసరమైతే మాట్లాడి ఆత్మ స్థైర్యం నింపాలని, ఇందులో భాగంగానే బీసీ సంఘం నాయకుడు వకుళాభరణం కృష్ణ మోహనరావు ను రంగం లోకి దించి ఈటెల కు వ్యతిరేకంగా డిబేట్ లలో మాట్లాడి స్తున్నట్లు సమాచారం.

  ఏది ఏమైనా ఒకవేళ కెసిఆర్ వ్యూ హం ఫలించి కౌశిక్ తెరాస తీర్థం పుచ్చుకుంటే నియోజక వర్గ రాజకయాలు రసవత్తరం అవుతాయని భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం తమ నాయకుడు కౌశిక్ పార్టీ వీడడాని,తెరాస లోకి వెళ్ళడని చెబుతున్న పరిస్థితి..
  Published by:yveerash yveerash
  First published: