IS THIS STRATEGY BEHIND CM KCR CALCULATIONS READ HERE MS BK
CM KCR లెక్కల వెనుక అసలు కథ ఇదే... నామినేటెడ్ పోస్టుల భర్తీ అందుకేనా..?
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
దుబ్బాక ఫలితాల తరువాత కేసీఆర్ అండ్ కో.. కు తమ ప్రత్యర్ధి పార్టీపై ఒక క్లారీటీ రావడంతో ఇప్పుడు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడు గా వెళ్తుండటంతో దానిని దెబ్బతీయడానికి సీఎం అస్త్రాలు సిద్ధం చేస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.
దుబ్బాక ఫలితాల తరువాత అధికారపార్టీ వర్గాలు గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆందోళన చెందుతున్నారు. దుబ్బాక ఫలితాల తరువాత కేసీఆర్ అండ్ కో.. కు తమ ప్రత్యర్ధి పార్టీపై ఒక క్లారీటీ రావడంతో ఇప్పుడు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మంచి ఊపు మీద ఉండటంతో భవిష్యత్ లో ఈ పార్టీ నుంచే తమకు గట్టి పోటీ ఉందనే వాదనను కేసీఆర్ బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇది దృష్టిలో పెట్టుకోని జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే భారీ సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తోన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ కి దగ్గర ఉన్న సామాజిక వర్గానికి మూడు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి కూడా ఇదే కారణం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక దశలో పీవీ నరసింహారావు కూతరుకు ఎమ్మెల్సీ ఇస్తారని పార్టీ నుంచే లీకులు వచ్చేలా చేసిన కేసీఆర్.. చివరి నిముషంలో దుబ్బాక ఫలితాల తరువాత తన మనసు మార్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీన్ లో లేదు.. ఈ నేపథ్యంలో పీవీ కూతురుకు ఇవ్వడం వలన ఏం ఉపయోగం ఉండదనే లెక్కలతోనే కేసీఆర్ చివరి నిముషంలో ఆమె పేరు ను లిస్ట్ నుంచి తొలిగించారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
దుబ్బాక ఫలితాల తరువాత ప్రస్తుతం తెలంగాణలో పోటీ టీఆర్ఎస్ , బిజేపీ అనేది స్పష్టమైంది. అందుకు త్వరలో జరగబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్య పోరు ఉండబోతుంది. అందుకే బీజేపీని బలహీన పరచడంలో భాగంగానే కేసీఆర్ ఆ పార్టీకి అండగా ఉన్న సామాజికవర్గంపైనే ప్రదానంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే దయానంద్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవి శ్రీనివాస్ గుప్తాకు ఇవ్వడం... తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ఛైర్మన్ పదవి అమరవాది లక్ష్మీనారాయణకు ఇవ్వడం కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా వేసిన లెక్కలో భాగమే అని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు రెండు ఎమ్మెల్సీలతోపాటు రెండు చెర్మన్ పదవులు కట్టబెట్టడం చూస్తోంటే అధికారపార్టీ బీజేపీ విషయంలో ఎంత సీరియస్ గా ఉందో అర్ధమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తమపార్టీకి మద్దతుగా ఉన్న సామాజిక వర్గాలకు పదవుల ఇవ్వడం వలన సామాజికవర్గం మొత్తం కేసీఆర్ వెంటనే ఉంటుందనుకోవడం వాళ్ల మూర్ఖత్వం అవుతుందని అంటున్నారు కమళదళం నేతలు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టిన వ్యక్తులకు తమ సొంత సామాజిక వర్గంలోనే చాలా వ్యతిరేకత ఉందని అంటున్నారు. కేసీఆర్ ఎన్ని లెక్కలు...సామాజికవర్గ సమీకరణలు చేసినా భవిష్యత్ లో తెలంగాణలో ఉండబోయే పార్టీ బీజేపీనే అని ధీమా వ్యక్తం చేస్తోన్నారు ఆ పార్టీ నేతలు. మరి కేసీఆర్ లెక్కలు.. వ్యూహాలు ఎంతమేర సక్సెస్ అవుతాయనేది కొద్దిరోజుల్లోనే తేలనుంది.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.