Home /News /telangana /

IS THERE ANY RESTRICTIONS TO CELEBRATE NEW YEAR AND CHRISTMAS VRY BK

  Omicron : తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ వేడుకలకు ఆంక్షలు ఉన్నాయా...? లేవా...?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Omicron : ఒమిక్రాన్ ఆంక్షలపై గందరగోళం ఏర్పడింది.. ఓ రేపు క్రిస్మస్ పండగ తోపాటు న్యూ ఇయర్ వేడుకలకు కూడా ప్రజలు సిద్దమవుతున్నారు. అయితే ఈ సారి ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్య ఆంక్షలు ఉంటాయా.. లేదా అనేది స్పష్టత రావడం లేదు.. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు..

ఇంకా చదవండి ...
  దేశ‌వ్యాప్తంగా ఓమిక్రాన్ కేస‌ులు వ్యాప్తి రోజు రోజుకి గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. నేప‌థ్యంలో క్రిస్మస్ తోపాటు, నూత‌న సంవ‌త్స‌ర వేడులకు, సంక్రాంతి పండ‌గ స‌మ‌యాల్లో ప్ర‌భుత్వం ఎటువంటి నియ‌మనిబంధ‌న‌లు పెట్టాల‌న్న‌దానిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డబ్ల్యూహెచ్‌ఓ ఈ స‌మ‌యంలో భారీ స‌ముహాలతో పాటు, వేడుక‌ల‌పై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాలకు సూచించినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటిదేమీ కనిపించడం లేదు. ఓమిక్రాన్ వ్యాప్తిని నివారించ‌డానికి రాష్ట్రాలు క‌ట్టుదిట్ట‌మైన ఆంక్షాలు విధించాల‌ని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను సూచింది. ఈ వేడుక‌ల స‌మ‌యంలో ఓమిక్రాన్ వ్యాప్తిని నిరోధించడానికి ఆంక్షలు విధించడంతోపాటు ఇత‌ర‌ చర్యలపై ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటాయ‌న్న అంశం ఇప్పుడు ఆస‌క్తిని రేపుతుంది.  ఇదిలా ఉంటే ఎటువంటి నిబంధ‌న‌లు పెట్టాల‌న్న‌దానిపై తెలంగాణ ప్ర‌భుత్వంతోపాటు ఏపీ ప్ర‌భుత్వం కూడా క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య నిపుణులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల‌, ప్రభుత్వ సలహాదారుల అభిప్రాయాల‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది.

  విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఇప్ప‌టికే సేక‌రించిన ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి శుక్ర‌వారం  సమర్పించనున్నారు. కోవిడ్ కార‌ణంగా గత ఏడాది గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు అండ్ రిసార్ట్‌ల వ‌ర‌కు న్యూ ఇయ‌ర్  వేడుకలను పరిమితం చేశాయి.  అయితే గ‌త ఏడాది కోవిడ్ స‌మ‌యంలో ఎటువంటి చ‌ర్య‌లు, ఆంక్ష‌లు తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి ఆంక్షాలు విధించ‌డం మంచిద‌ని కొంద‌రు అభిప్రాప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.దీంతో పాటు  డిసెంబర్ 31 నైట్ బ్రీత్‌లైజర్ల‌తో ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వహించడం మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు సంబంధించిన ఆంక్ష‌లైతే ఉంటాయి.  కాని ప్రచారం జ‌రుగుతున్న‌ట్లు లాక్ డౌన్ విధించే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం లేన‌ట్లు తెలుస్తోంది.

  Nalgonda : ట్రాన్స్‌జెండర్స్‌తో ఫ్రెండ్‌షిప్.. నమ్మిన వారే నరకం చూపించారు.. తల, మొండెం వేరు చేసి.

  ప్రస్తుతానికి కఠినమైన ఆంక్షలు లేనప్పటికీ, అవసరమైతే కొన్ని విధించే అవకాశాలను అధికారులు తోసిపుచ్చలేదు.  ఇదిలా ఉంటే తాజాగా క్రిస్మస్‌, కొత్త సంవత్సరం, మకర సంక్రాంతి వేడుకల నేపథ్యంలో ఆంక్షలు విధించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో క‌ట్టుదిట్ట‌మైన ఆంక్ష‌లు విధించాల‌ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచింది. దీంతో పాటు  ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులను ఖ‌చ్చితంగా టెస్టులు చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈనెల‌ 21న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

  Guest lecturer Suicide : ఇద్దరు గెస్ట్ లెక్చరర్ల మధ్య అక్రమ సంబంధం.. లేడీ లెక్చరర్ బెదిరింపులు

  మ‌రో వైపు ఏపీ ప్ర‌భుత్వం ఎటువంటి ఆంక్ష‌లు విధించాల‌న్నదానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఒక నిర్ణ‌యం తీసుకోలేదు. క‌ఠిన‌మైన ఆంక్ష‌లు లేన‌ప్ప‌టికి సాదార‌ణ ఆంక్ష‌లు ఉంటాయని అంటున్నాయి ప్ర‌భుత్వ వ‌ర్గాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు పెట్ట‌బోయే ఆంక్ష‌ల‌కు సంబంధించి  త్వరలో ఒక క్లారీటి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
  Published by:Purna Chandra
  First published:

  Tags: Ap, Hyderabad, Omicron

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు