జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా
ఎవరికోసం తాము పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారో.. నిత్యం తాము ఎవరి మధ్యన తిరుగుతున్నారో.. ఎవరి అండతో, ఎవరిని ఉద్ధరిస్తున్నామని చెబుతున్నారో.. చివరకు వాళ్లనే నిర్బంధించారు. ( maoist recruitment ) కారణం స్పష్టంగా తెలీకపోయినా తమ సభలకు హాజరైన వారిలో పదిహేను మంది గిరిజనాన్ని మాత్రం మావోయిస్టులు నిర్బంధంలో ఉంచుకున్నట్టు తెలుస్తోంది.
దీంతో ఈ పరిణామాలు మావోయిస్టు ఉద్యమంలో ఇదో కొత్తకోణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సహజంగా తమ విధానాలు నచ్చి.. లేదా తమ పంథా పట్ల ఆకర్షితులయ్యో.. ఉద్యమంలోకి వచ్చే వారిని తమతో చేర్చుకోవడం ఉద్యమ ఆనవాయితీ. ( maoist recruitment ) పీపుల్‌సవార్ అయినా విలీనంతో రూపాంతరం చెందిన మావోయిస్టు పార్టీ అయినా ఇది సాధారణం. ఇప్పటిదాకా వివిధ స్థాయుల్లో పనిచేసిన క్యాడర్, నేతృత్వం వహించిన నాయకత్వం అంతా ఇలా వచ్చి చేరిందే..
Hyderabad : ఆదిలాబాద్ కలెక్టర్ పై గోనే ప్రకాశ్ రావు వివాదస్పద వ్యాఖ్యలు... కేసిఆర్ బాషలో ఆమె..
అనంతర కాలంలో రిక్రూట్మెంట్ దాకా పరిస్థితులు చేరాయి. కొన్ని ప్రాంతాలలో సమాంతర పాలన నడుపుతున్న మావోలు చత్తీస్‌ఘడ్‌లో మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపిక, రేషన్ పంపిణీ చేస్తున్నట్టు తెలిసిందే. ( maoist recruitment ) అయితే ఇప్పుడు మాత్రం తమతో కలసి పోరాటానికి ముందుకురావడం లేదన్న కారణం చూపి కొందరు గిరిజనులను నిర్బంధించినట్టు సమాచారం. ఇది మావోయిస్టు ఉద్యమ పంథాలో వస్తున్న మార్పా.. లేక మరేదైనా కారణం ఉందా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఈనెల 2 నుంచి 8 వ తేదీ దాకా 21వ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఏజెన్సీలోని ప్రతి గిరిజన గూ డెంలోనూ సభలు, సమావేశాలు నిర్వహించాలని, మావోయిస్టు పార్టీ జెండా ఎగరేయాలని చెప్పారు. ( maoist recruitment )ఈమేరకు అన్ని స్థాయుల్లోని క్యాడర్‌కు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా ఇప్పటికే రకరకాల కారణాలతో టాప్ క్యాడర్‌ను కోల్పోయిన మావోయిస్టు పార్టీకి తమ ఉనికిని చాటుకోవడం, ప్రతిష్టను పెంచుకోవడం సవాలుగా మారింది. దీంతో తమకు మిలీషియాగా పనిచేస్తున్న గిరిజనంపై ఈసారి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీనికోసమే అన్ని గిరిజనగూడేల్లోనూ జెండా ఎగరాలన్న గట్టి పట్టుదలను కనబర్చినట్టు చెబుతున్నారు.
Medak : ముహుర్తానికి ముందే బంధువు మృతి.. కీడు అంటూ.. పెళ్లిని రద్దు చేసిన వరుడు... !
అదే సమయంలో మావోయిస్టు వారోత్సవాలను నిర్వీర్యం చేయడానికి, విధ్వంసాన్ని నిరోధించడానికి పోలీసులు కూంబింగ్‌లు, రహదారి తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పరిమితంగానే వారోత్సవ సభలను నిర్వహించినట్టు చెబుతున్నా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి సైతం కొందరు గిరిజనం హాజరైనట్టు చెబుతున్నారు.( maoist recruitment ) వీరిలో సభలు ముగిశాక అందరినీ పంపించివేసినా.. కుర్నవల్లి, బోదనెల్లి గ్రామాలకు చెందిన గిరిజనాన్ని మాత్రం అక్కడే నిర్బంధించినట్టు చెబుతున్నారు. ( maoist recruitment )దీంతో ఆ పదిహేను మందికి చెందిన కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దీనిపై గిరిజనం ఎక్కడా నోరుమెదపడం లేదు.తెరిస్తే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న బెంగ వారిని వెంటాడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.