Home /News /telangana /

IS THAT THE REASON WHY TELANGANA CM KCR MET SAMAJWADI PARTY CHIEF AKHILESH YADAV IN DELHI PRV

KCR Delhi tour: యూపీ మాజీ సీఎం అఖిలేష్​తో CM KCR​ భేటీ.. ఈ అకస్మాత్తు సమావేశానికి కారణమదేనా?

సీఎం కేసీఆర్​తో అఖిలేష్​

సీఎం కేసీఆర్​తో అఖిలేష్​

తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో సీఎం కేసీఆర్​ పలువురితో సమీక్షలు నిర్వహిస్తున్నారనే టాక్ వినిపించినా ఆయన టూర్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అఖిలేష్ యాదవ్ కలవడంతో రాజకీయాల్లో వేడి పెరిగింది.

    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR).. ఇవాళ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో సమాజ్​వాదీ (Samajwadi) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav)​తో పాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారిరువురిని శాలువా కప్పి ఆహ్వానం పలికారు. జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. దాదాపు రెండుగంటలకుపైగా భేటీ కొనసాగింది. అయితే ఈ అకస్మాత్తు భేటీ వెనుక చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

    ఆసక్తికర సంఘటన..

    ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ (KCR Delhi tour) తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతారనే లీకులు వచ్చాయి. కానీ, అలాంటిదేమి జరగలేదు. హస్తినకు వెళ్లి నాలుగు రోజులు అవుతున్నా కేసీఆర్ (KCR) ఇంటిని వీడి బయటకు రావడం లేదని, అసలు ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారనే విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన రుణాల విషయంలో పలువురితో సమీక్షలు నిర్వహిస్తున్నారనే టాక్ వినిపించినా శుక్రవారం కేసీఆర్ టూర్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అఖిలేష్ యాదవ్ కేసీఆర్ను కలవడంతో రాజకీయాల్లో వేడి పెరిగింది.

    ఈడీ దర్యాప్తులపై..

    అయితే వీరిద్దరి మధ్య జాతీయ రాజకీయాలతో పాటు ఇటీవల బీజేపీయేతర ప్రభుత్వాలు, పార్టీలకు చెందిన నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న దాడుల విషయంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.  మరోవైపు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్పై ఇప్పటికే ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్ధ ఛటర్జీ, అర్పిత నివాసాలపై దాడులు నిర్వహించింది. అంతే కాకుండా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన సీనియర్ నేత సంజయ్ రావుత్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేయడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

    పార్లమెంట్​లో సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించడం, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ, ఛటర్జీ నివాసాలపై దాడులు సాగించడం వంటి పరిణామాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ప్రారంభంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అరవింద్ ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్, శరద్ పవార్లతో సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులతో మాట్లాడారు. రాజకీయాల గురించి ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.  అయితే కేసీఆర్​..   ప్రతిపక్ష నేతలపై కేంద్రం ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందనే అంశంలో విపక్షాల మధ్య ఐక్యత తీసుకువచ్చి ఓ కార్యచరణను రూపొందించబోతున్నారా? అనే కోణంలో చాలామంది చర్చించుకుంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Akhilesh Yadav, CM KCR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు