హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: ఇక నిరుద్యోగ భృతి లేనట్టేనా? -జాబ్ క్యాలెండర్‌లో మతలబు? -నమోదైన నిరుద్యోగులే 25 లక్షలు!

CM KCR: ఇక నిరుద్యోగ భృతి లేనట్టేనా? -జాబ్ క్యాలెండర్‌లో మతలబు? -నమోదైన నిరుద్యోగులే 25 లక్షలు!

కొత్త కొలువులపై సీఎం కేసీఆర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి అంశం జోలికి వెళ్లకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. యువతకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3,116 అందజేస్తామని టీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ..

కొత్త కొలువులపై సీఎం కేసీఆర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి అంశం జోలికి వెళ్లకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. యువతకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3,116 అందజేస్తామని టీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ..

కొత్త కొలువులపై సీఎం కేసీఆర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి అంశం జోలికి వెళ్లకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. యువతకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3,116 అందజేస్తామని టీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ..

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలను మరింత ఉధృతం చేస్తూ సీఎం కేసీఆర్ మెగా కొలువుల జాతర ప్రకటించారు. ఏకంగా 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్న సీఎం.. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 అని, వీటికి దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దాదాపు 40 నిమిషాలపాటు అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో నిరుద్యోగ భృతి అంశం జోలికి వెళ్లకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొలువుల ప్రకటనకుతోడు ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సీఎం ప్రకటనతో నిరుద్యోగ భృతి అటకెక్కినట్లేనా?, కొవిడ్ దెబ్బకు ఉపాధి అవకాశాలు తగ్గిన నేపథ్యంలో నిరుద్యోగ భృతి లేకపోవడం యువతకు భారమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

‘తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని త్వరితగతిన చేపడతాం. అదే సమయంలో యువతకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3,116 అందజేస్తాం..’అని టీఆర్ఎస్ తన 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది. కానీ గడిచిన మూడున్నరేళ్లలో ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి లభించలేదు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొలువుల ప్రకటనతోపాటే నిరుద్యోగ భృతిపైనా కేసీఆర్ క్లారిటీ ఇస్తారని యువత ఆశించినా, కనీసం ఆ పదాన్ని కూడా సీఎం ప్రస్తావించకపోవడం గమనార్హం. నిజానికి

CM KCR: జాతీయ రికార్డు బద్దలు! -కొత్తగా 80,039 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు -ఖజానాపై భరం ఎంతో తెలుసా?


తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల వరకు ఉంటుందని నిరుద్యోగ సంఘాలు వివరిస్తున్నాయి.కాగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ)లో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద 25 లక్షల మందికిపైగా రిజిస్టర్‌ చేసుకున్నారు. అంటే, రాష్ట్రంలో నమోదైన నిరుద్యోగుల సంఖ్య 25 లక్షలుకాగా, సర్కారు ఇప్పుడు ప్రకటించిన ఉద్యోగాల సంఖ్య లక్ష కూడా చేరలేదు. కేసీఆర్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులు అందరికీ భృతి విడుదల చేయాలని విపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు.

CM KCRకు భిన్నంగా మంత్రి KTR -విరోధులతోనూ ఆత్మీయ ఆలింగనం -ఈటల ముఖం చూడొద్దనే సస్పెన్షన్?


నిరుద్యోగులకు 37నెలల భృతిని అందజేయాలని, అలా చేస్తే సీఎం కేసీఆర్ చిత్రానికి పాలాభిషేకం చేస్తాని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాహాటంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ)లో పేర్లు నమోదు చేసుకున్న 25 లక్షల మందికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని, 37 నెలలకు గానూ ఒక్కో నిరుద్యోగి బ్యాంకు ఖాతాలో వెంటనే రూ.1.20 లక్షల చొప్పున జమ చేయాల్సిందేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు అసెంబ్లీలో కేసీఆర్ చేసిన కొలువుల ప్రకటనపైనా విపక్షాలు సందేహాలను వెలిబుచ్చుతున్నాయి..

రైతులకు శుభవార్త : ఆ రుణాలన్నీ మాఫీ -రూ. 16,144 కోట్ల భారం తగ్గినట్లే -సాగుకు భారీగా నిధులు


ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, అపోహాలు పోవడానికి యువకులకు స్పష్టత ఉండటానికి ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి ప్రతీ సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి పారదర్శకంగా ఉద్యోగ నియామకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ అన్నారు. తద్వారా కొలువుల జాతర ఇకపైనా కొనసాగుతుందని చెప్పారు. వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వనున్న క్రమంలో, ఆ మేరకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించనున్న నేపథ్యంలో ఇక నిరుద్యోగ భృతి అనవసరమనే యోచనలో గులాబీ బాస్ ఉన్నారని, అయితే ఆ విషయాన్ని బయటికి చెప్పే ఉద్దేశం ఆయనకు లేదనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా నిరుద్యోగ భృతిని అటకెక్కిస్తారా? లేక రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ అనూహ్య ప్రకటన చేస్తారా? అనేది వేచిచూడాలి.

First published:

Tags: CM KCR, Covid, Government jobs, Job notification, Telangana Budget 2022

ఉత్తమ కథలు