హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad politics: మరోసారి అక్క ఆశీస్సుల కోసం క్యూ కడుతున్న జిల్లా నేతలు.. జిల్లాలో చక్రం తిప్పుతున్న కవితక్క

Nizamabad politics: మరోసారి అక్క ఆశీస్సుల కోసం క్యూ కడుతున్న జిల్లా నేతలు.. జిల్లాలో చక్రం తిప్పుతున్న కవితక్క

ఆర్టీసీ చైర్మణ్ బాజిరెడ్డి గోవర్థన్ ,ఎమ్మెల్సీ కవితా

ఆర్టీసీ చైర్మణ్ బాజిరెడ్డి గోవర్థన్ ,ఎమ్మెల్సీ కవితా

Nizamabad politics : చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవిత మరోసారి జిల్లాల్లో చక్రం తిప్పుతుందా.. ఆమె అనుగ్రహం లేనిదే పదవులు దక్కని పరస్థితి నెలకొందా.. ఇటివల ఆర్టీసీ చైర్మణ్‌గా నియమితులైన బాజిరెడ్డి గోవర్థన్‌ను అందుకే పదవి వరించిందా.. ?

ఇంకా చదవండి ...

నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి పి మ‌హేంద‌ర్,

నామినేటేడ్ ప‌ద‌వు లైన‌, పార్టీ ప‌ద‌వు లైన కావాలంటే ఎమ్మెల్సీ క‌విత‌కు (mlc kavitha) క‌లువాల్సిందే.. ఆమె ఆనుగ్ర‌హం ఉంటేనే ప‌ద‌వులు వ‌రిస్తాయి.. తాజాగా నిజామాబాద్(Nizamabad) రూర‌ల్ ఎమ్మేల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ కు ఆర్టీసీ చైర్మ‌న్ (rtc chairman)ప‌దవి వ‌చ్చిందంటే అది కేవ‌లం క‌విత వ‌ల్లే అని జిల్లాలో చ‌ర్చించుకుంటున్నారు.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ కవిత మ‌దత్తు కోసం క్యూ కడుతున్నారు.. జిల్లాలో పార్టీ సంస్థాగత పదవులతో పాటు ఇతర పదవులు ఆమె చెప్పినవారికి దక్కుతున్నాయి..

సీఎం కేసీఆర్(cm kcr) తనయగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యురాలుగా కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తుంది.. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత 2014లో జ‌రిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం సాదించారు.. అయితే పలు కారాణాల వల్ల 2019లో జ‌రిగ‌న పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు.. దీంతో కోద్ది రోజుల పాటు రాజ‌కీయ‌ల‌కు జిల్లాల‌కు దూరంగా ఉన్నారు.. అనంతరం 2020లో స్థానిక సంస్థ‌ల ఎమ్మేల్సీగా విజ‌యం సాధించారు. దీంతో ఆప్ప‌టి నుంచి జిల్లా రాజ‌కీయ‌ల్లో కీల‌కంగా మారారు..

ఇది చదవండి :  పీజీ చేసి.. రోడ్లపై చీపురు పట్టింది.. స్వీపర్ నుండి ఎంటమాలజిస్టుగా మారింది..

దీంతో అప్పటి నుండి కవిత మరోసారి జిల్లాలో చక్రం తిప్పుతున్నారు.. ఈ క్రమంలోనే పోయిన చోటే వెదుక్కొవాలనే ధోరణిలో ఉన్న స్థానిక నేతలు సైతం పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఉమ్మ‌డి జిల్లాలో ఎలాంటి పార్టీ ప‌ద‌వులైన‌, నామినేటేడ్ ప‌ద‌వులైన అశించేవారు.. మంత్రులు, ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్యేలు అండదండలు ఉన్నా క‌విత ఆనుగ్ర‌హం లేనిదే వ‌రించదనే పరిస్థితి మరోసారి తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో రెండు జిల్లాల అధ్యక్ష పదవుల భర్తీ ఉంది.. అయితే ఆ ప‌దవుల ఎవ‌రికి ద‌క్కుతాయ‌నే విష‌యం పై చ‌ర్చ జ‌రుగుతుంది.. అయితే కవితా చెప్పిన వారికి మాత్ర‌మే అధ్య‌క్ష ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని ప్రచారం జోరందుకుంది.. ఉమ్మడి జిల్లాలో గ్రామ, మండల పదవులు దాదాపు కొలిక్కి వచ్చాయి.. ఈ నెల చివ‌రి వ‌ర‌కు జిల్లా కమిటీలు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.. టిఆర్ఎస్ పార్టీలో సంస్థాగత, అధికార పదవుల భర్తీ చుట్టూ జరుగుతున్నా రాజకీయాలకు ఎమ్మెల్సీ కవిత కేంద్ర బిందువు గా మారారు..

ఇది చదవండి :  రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత.. టీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీల మధ్య కర్రలతో దాడులు.!

టిఆర్ఎస్(trs) అధినేత సీఎం కేసీఆర్ జిల్లా అధ్యక్ష పదవిలో ఎమ్మెల్యేలకు అవకాశం లేదని కరాఖండిగా చెప్పారు.. ఎందుకంటే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ ఉంటే ఎమ్మెల్యేలు (mla)చెప్పిందే వేదమని పార్టీని నమ్ముకొని పార్టీ స్థాపించిన అప్పటి నుంచి జెండాను మోసి ఉద్యమంలో పాల్గొన్న వారికి అన్యాయం జ‌రుగకూడ‌ద‌నే ఉద్యేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు..

ఇక 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ పార్ల మెంట్(nizamabad parlament) నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజ‌యం సాదించింది.. కానీ 2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌విత ఓట‌మి చవిచూశారు కవిత ఎంపీగా ఓటమికి ఎమ్మెల్యేలు కారణమని తెలిసినా వారిపై కేసీఆర్ చర్యలు తీసుకోలేక పోయారు.. దీంతో తన ఓటమిని సవాల్‌గా తీసుకున్న కవిత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ‌యం సాదించింది.. శాసన మండలి ఎన్నికలు ఎన్నికయ్యే వరకు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. అయితే తాజాగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా ఇప్పుడు జిల్లాలో పార్టీ పదవులు కానీ ఇతర అధికార పదవులు అన్ని కవిత చెప్పినవారికి దక్కుతాయని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు..

ఇది చదవండి :  పెళ్లికి ముందు బావా.. తర్వాత వరసకు సోదరుడు అయ్యాడు.. వారం రోజుల్లోనే పెళ్లింట విషాదం

దీంతో ఆమెను మరోసారి ప్రసన్నం చేసుకోవడం కోసం నేతలు హైదరాబాద్‌కు(hyderabad) క్యూ కడుతున్నారు..దీంతో జిల్లా రాజకీయాల్లో మరోసారి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా ఎమ్మేల్సీ క‌విత కనిపిస్తుంది.. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన ఆమె హైదరాబాద్ నుండే చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.. మరోవైపు పార్టీ పై అసంతృప్తి ఉన్న నేతలను పార్టీలో ప్రాధాన్యం కల్పించే పనిలో పడ్డారు..

ఇలా ఆర్టీసీ చైర్మన్ ప‌దవి నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మేల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ కు ఖరారు చేసినట్టు తెలుస్తంది.. దీంతో సీఎం ఆఫీస్ నుంచి బాజిరెడ్డికి పిలుపు వ‌చ్చింది.. వెంట‌నే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ క‌లిసారు.. అక్క‌డి నుంచి ఎమ్మేల్సీ క‌విత‌నే మొద‌ట‌ క‌లిశారు.. ఇటీవల జిల్లాకు చెందిన నేత‌లు పార్టీ జిల్లా అద్య‌క్ష ప‌ద‌వుల కొసం ఎమ్మెల్సీ క‌విత‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ఆ నేత‌లు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.. చాలా మంది నేతలు స్వయంగా కలిసి తమ పార్టీకి చేసిన సేవలను గుర్తించి వివరించి పదవులు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది..

జిల్లా అధ్యక్ష పదవులతోపాటు అద్య‌క్ష నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఆశిస్తున్న వారు కూడా కవిత కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.. దీంతో పదవులు ఎవరికి దక్కినా కవిత ఆమోదం ఖాయమనే టాక్ నడుస్తోంది.

First published:

Tags: Kalvakuntla Kavitha, Nizamabad

ఉత్తమ కథలు